
జల్సాగా బతకాలి అన్న కోరికతో ఓ యువకుడు కటకటల పాలయ్యాడు. చేస్తున్న పనిలో జీతం తక్కువ రావడంతో దొంగతనాలు చేసిన సరే విలాసవంతమైన జీవితం గడుపుదాం అనుకున్నాడు ఆ ఆలోచన అతన్ని జైలు పాలు చేసింది. సంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామ శివారులో గత సోమవారం రోజు సుజాత అనే మహిళ గేదలు మేపుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో నుంచి గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించగా సుజాత ప్రతిఘటించడంతో కత్తితో మెడపై, కడుపులో దాడి చేసి మెడలో ఉన్న తాళిబొట్టుతో పరారయ్యాడు. నిందితున్ని 24 గంటలు గడవకముందే సంగారెడ్డి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన జగన్ అనే వ్యక్తి ఏరియాలో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తను చేసిన పనికి జీతం సరిపోకపోవడంతో దొంగతనం చేస్తే తన అవసరాలకు సరిపోతుందని భావించి మహిళా మెడలో నుంచి గొలుసును దొంగలించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.