Crime News: ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. సంచలన తీర్పు వెల్లడించిన రంగారెడ్డి జిల్లా కోర్టు..

|

Feb 09, 2021 | 5:34 PM

Crime News: మైనర్ బాలిక హత్యాచారం కేసులో రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి..

Crime News: ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. సంచలన తీర్పు వెల్లడించిన రంగారెడ్డి జిల్లా కోర్టు..
Follow us on

Crime News: మైనర్ బాలిక హత్యాచారం కేసులో రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ఆపై దారుణంగా హతమార్చిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు ధర్మాసనం మరణ శిక్ష విధించింది. దాంతో పాటు వెయ్యి రూపాయల జరిమానాను విధించింది. సైబరాబాద్ కమీషనరేట్‌ లిమిట్స్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017 సంవత్సరంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరు సంవత్సరాల చిన్నారిని నిందితుడు దినేష్ చాక్లెట్ ఇప్పిస్తానంటూ తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. చిన్నారి తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు.. నిందితుడు దినేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన పూర్వపరాలు పరిశీలించిన న్యాయస్థానం.. నిందితుడు దినేష్‌కు ఇవాళ మరణ శిక్ష ఖరారు చేసింది.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం ఎనిమిది మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసుల్లో న్యాయస్థానాలు ఏడుగురికి మరణశిక్ష విధించాయి. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధికి వచ్చేసరికి నార్సింగి పోలీసు స్టేషన్ లిమిట్స్‌లో జరిగిన ఈ కేసులోనే తొలి మరణశిక్ష పడింది. ఈ శిక్షపై స్పందించిన సీపీ సజ్జనార్.. నిందితులకు శిక్షలు పడే విధంగా పోలీసులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పక్క సాక్ష్యాలతో నిందితులకు శిక్షలు పడే విధంగా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు.

ఇదిలాఉంటే, తెలంగాణ ఏర్పాటు తరువాత 2016 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏడుగురు నిందితులకు మరణ శిక్ష విధించడం జరిగింది. 2016 లో కరీంనగర్‌లో నాలుగు సంవత్సరాల చిన్నారి హత్యాచారం కేసు లో నిందితుడికి మరణ శిక్ష విధించడం జరిగింది. ఆ తరువాత 2019 వరంగల్‌లో ఆరు నెలల చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడికి ఉరి శిక్ష విధించారు. ఇక 2020లో బొమ్మల రామరంలో హాజిపుర్ ఘటనకు సంబంధించి శ్రీనివాస్‌కు ఉరి శిక్ష పడింది. 2020 లో ఆసిఫాబాద్ జిల్లా సమత కేసులోనూ నిందితుడికి ఉరి శిక్ష విధించడం జరిగింది. తాజాగా 2021లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు సంవత్సరాల చిన్నారి హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష ఖరారైంది.

Also read:

Coronavirus: మనిషి చెమట వాసనను చూసి కరోనాను గుర్తిస్తున్న కుక్కలు.. శునకాలకు ప్రత్యేక శిక్షణ

NRI Couple Skiing :భారతీయ సంప్రాయమైన చీర, ధోతి లో ఎన్ఆర్ఐ జంట స్కీయింగ్‌. వైరల్ అవుతున్న వీడియో