గోశాలలో రక్షా బంధన్‌..నేరేడు చెట్టుకు బర్త్‌డే..!

| Edited By: Srinu

Aug 16, 2019 | 7:09 PM

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని కామధేను గోశాలలో రాఖీ పండగ వేడుకలు విభిన్నంగా జరిగాయి. పర్యావరణ పరిరక్షణను అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహకులు స్థానికులు కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇక్కడి గోశాలలో ప్రతీయేటా మొక్కలు నాటడం ఆనవాయితీ..కాగా  నాలుగేళ్ల క్రితం ఆగస్టు 15న నాటిన నేరేడు మొక్క నేడు మహావృక్షంగా ఎదగడంతో దానికి పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. బంధుమిత్రుల సమక్షంలో ఐదో పుట్టిన రోజు సందర్భంగా దానికి పసుపు, […]

గోశాలలో రక్షా బంధన్‌..నేరేడు చెట్టుకు బర్త్‌డే..!
Follow us on

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని కామధేను గోశాలలో రాఖీ పండగ వేడుకలు విభిన్నంగా జరిగాయి. పర్యావరణ పరిరక్షణను అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో నిర్వహకులు స్థానికులు కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇక్కడి గోశాలలో ప్రతీయేటా మొక్కలు నాటడం ఆనవాయితీ..కాగా  నాలుగేళ్ల క్రితం ఆగస్టు 15న నాటిన నేరేడు మొక్క నేడు మహావృక్షంగా ఎదగడంతో దానికి పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. బంధుమిత్రుల సమక్షంలో ఐదో పుట్టిన రోజు సందర్భంగా దానికి పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేశారు.

గోశాలలోని గోమాతకు కూడా పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, చిన్నారులు నేరేడు చెట్టుకు రాఖీలు కట్టారు. వృక్షో..రక్షతి రక్షితాః అని రాసి పెట్టిన ప్రత్యేక రాఖీలను చెట్లకు కట్టి ఆనందించారు. చెట్లను విరివిగా పెంచాలనే అవగాహన ప్రజల్లో కల్పించాలనే లక్ష్యంతోనే తాము ఇదంతా చెస్తున్నామని చెప్పారు కామధేను గోశాల నిర్వాహకులు.