తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికుడి కాపాడాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహారించిన ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టాడు. రన్నింగ్ ట్రైన్ ఎక్కబోతూ పడిపోయిన ప్రయాణికుడిని రెప్పపాటులో రక్షించాడు రైల్వే పోలీస్. నిండు ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన వికారాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగింది. మహారాష్ట్ర లాతూర్‌కి చెందిన ఏక్‌నాథ్ కుమ్లే రైలు దిగి స్టేషన్‌లోకి వెళ్లాడు. కాసేపటికి రైలు ప్రారంభం కావడంతో ప్రయాణికుడు పరుగెత్తి కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. మెట్లపై కాలు జారడంతో.. రైలు కింద పట్టాలపై పడబోయాడు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సరైన సమయంలో స్పందించి తనని వెనక్కి లాగాడు.
ఈ ప్రమాదంలో ప్రయాణికుడు ఏక్‌నాథ్ కుమ్లే క్షేమంగా బయటపడ్డాడు. సకాలంలో స్పందించి ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను అక్కడి ప్రయాణికులతో పాటు సీఐ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. రన్నింగ్ ట్రైన్ ఎక్కవద్దంటూ సీఐ రాజేంద్ర ప్రసాద్ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…