TTE Wife Arrest: రైల్లో వరుస చోరీలు.. ఎట్టకేలకు చిక్కన దొంగ.. మ్యాటర్ తెలిసి బిత్తరపోయిన పోలీసులు..

|

May 22, 2022 | 12:50 PM

TTE Wife Arrest: రైళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టుకుని ఆర్పీఎఫ్ పోలీసులు షాక్‌కు గురయ్యారు. ప్రయాణికుల నగదు, నగలను..

TTE Wife Arrest: రైల్లో వరుస చోరీలు.. ఎట్టకేలకు చిక్కన దొంగ.. మ్యాటర్ తెలిసి బిత్తరపోయిన పోలీసులు..
Theft
Follow us on

TTE Wife Arrest: రైళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టుకుని ఆర్పీఎఫ్ పోలీసులు షాక్‌కు గురయ్యారు. ప్రయాణికుల నగదు, నగలను తస్కరిస్తున్నదీ రైల్వే ఉద్యోగి భార్య అని తెలిసి అవాక్కయ్యారు. తన కుమార్తె సీమంతం కోసం మణుగూరు వెళ్తున్న ప్రయాణికురాలి నగల బ్యాగు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోయింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు.. దొంగను ఇట్టే పట్టేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేట్‌లో ఉండే వెంకాయమ్మ మణుగూరుకు వెళ్లేందుకు ఈనె 17న రాత్రి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చింది. 4వ నంబరు గేట్‌ నుంచి వస్తుండగా నిందితురాలు ఆమెను వెంబడించి లిప్టులో రద్దీని ఆసరా చేసుకుని కొంగును హ్యండ్‌బ్యాగుపై కప్పి బంగారు నగల బాక్స్‌ దొంగిలించింది. ప్లాట్‌ఫారం వద్దకెళ్లిన వెంకాయమ్మ బ్యాగులో నగల బాక్స్‌ లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సీఐ శ్రీను, నర్సింహా గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలిని గుర్తించాయి. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నిందితురాలు రైల్వే టీటీఐ భార్య కావడం గమనార్హం. గతంలో నిందితురాలు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, పేట్‌బషీరాబాద్‌ పీఎస్ పరిధుల్లో చోరీలకు పాల్పడి అరెస్టైంది. ఆమె నుంచి 53 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి ఆల్విన్‌ కాలనీ తులసీనగర్‌లో ఉండే వెంకటేష్‌ రైల్వేలో టీటీఐగా పని చేస్తున్నారు. ఆయన భార్య అరూరి ప్రియ(40) డబ్బుపై ఆశతో చోరీలకు పాల్పడుతోందని ఆర్ఫీఎఫ్ పోలీసులు తెలిపారు.