Telangana: హైటెన్షన్​ తీగలపై ఎక్కిన కొండచిలువ.. ఆ తర్వాత ఏమైందంటే…?

|

Aug 26, 2022 | 6:36 PM

రంగారెడ్డి జిల్లాలో కొండచిలువ హైటెన్షన్ క్రియేట్ చేసింది. ఓ పొలంలో ఉన్న హైటెన్షన్ కరెంట్ పోల్ ఎక్కి హల్​చల్ చేసింది. ఆ తర్వాత...

Telangana: హైటెన్షన్​ తీగలపై ఎక్కిన కొండచిలువ.. ఆ తర్వాత ఏమైందంటే...?
Python
Follow us on

Ranga Reddy district: రంగారెడ్డి జిల్లాలో ఓ పైథాన్ తీవ్ర కలకలం రేపింది. యాచారం మండలం(Yacharam Mandal) కుర్మిద్దలో కొండచిలువ(Python) ఏకంగా హైటెన్షన్ వైర్లు ఉన్న కరెంట్ పోల్‌పైకి ఉన్న పాకేసింది. ఆపై ఒక తీగపై కొద్దికొద్దిగా పాకుతూ ముందుకు వెళ్లింది. దాన్ని గమనించిన రైతులు షాకయ్యారు. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు, కరెంట్ ఆఫీసుకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. దీంతో వెంటనే అలెర్టయిన సిబ్బంది.. కరెంట్ సప్లైకు ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా.. హైటెన్షన్ వైర్లపై పాకుతున్న పైథాన్‌ను తాళ్ల సాయంతో కిందపడేశారు. ఆపై ఫారెస్ట్ సిబ్బంది.. దాన్ని బంధించారు. ఆపై దగ్గర్లోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆహారాన్ని వెతుక్కుంటూ కొండచిలువ అక్కడికి వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. వన్యప్రాణులు కనిపిస్తే.. వాటిపై దాడి చేయకుండా తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పొలాల్లోని రైతులపై, రైతు కూలీలపై వన్య ప్రాణులు దాడి చేసే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి