బాసర ఆలయంలో సైకో హల్‌చల్

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ ఆలయంలో ఈ ఉదయం ఓ సైకో హల్‌చల్ చేశాడు. బ్లేడ్ తీసుకుని ఆలయంలోకి వచ్చి భక్తుల ఒంటిపై గాయాలు చేసుకుంటూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అతని చర్యలతో భక్తులు ఆందోళనతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకునేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే తన దగ్గరకు వస్తే సూసైడ్ చేసుకుంటానని ఆ సైకో బెదిరింపులకు దిగాడు. దీంతో బలవంతంగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆలయం వెలుపలికి […]

బాసర ఆలయంలో సైకో హల్‌చల్

Edited By:

Updated on: Mar 21, 2019 | 2:55 PM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ ఆలయంలో ఈ ఉదయం ఓ సైకో హల్‌చల్ చేశాడు. బ్లేడ్ తీసుకుని ఆలయంలోకి వచ్చి భక్తుల ఒంటిపై గాయాలు చేసుకుంటూ వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అతని చర్యలతో భక్తులు ఆందోళనతో పరుగులు తీశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకునేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే తన దగ్గరకు వస్తే సూసైడ్ చేసుకుంటానని ఆ సైకో బెదిరింపులకు దిగాడు. దీంతో బలవంతంగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, ఆలయం వెలుపలికి తీసుకెళ్లారు. ఆ సైకో నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి అని సమాచారం.