పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ పాత పగ.. కొత్త సెగ!

అసెంబ్లీ సెషన్స్ ముగిసినా సరే.. తెలంగాణ రాజకీయాల్లో ఓ కొత్త సెషన్ నడుస్తోందిప్పుడు. అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ యుద్ధం సాధారణం. కాని, మంత్రి వర్సెస్ మాజీల చుట్టూ మాత్రమే ఎడతెగని పొలిటికల్ వార్ జరగడం.. కాస్త అసాధారణం. అందులోనూ గత మూడునాలుగు రోజులుగా నడుస్తోందీ ఎపిసోడ్. మంత్రి పొంగులేటి టార్గెట్‌గా మాజీ మంత్రులు కేటీఆర్ అండ్ హరీష్ విరుచుకుపడుతున్నారు. ఇటు మంత్రి పొంగులేటికి అండగా మంత్రులతో పాటు ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. ఆరోపణలు చేయడం, ఆ తరువాత ఆ టాపిక్‌కు ఎండ్ కార్డ్ పడడం వెరీ కామన్. కాని, పొంగులేటి ఇష్యూలో అలా జరగడం లేదు ఎందుకని? పొలిటికల్‌గా మొదలైన దాడి ఏకంగా ఫ్యామిలీ దాకా వెళ్లింది. ఎందుకని? పైకి కనిపిస్తున్నంత చిన్న ఇష్యూ కాదిది. ఖమ్మం ఖిల్లాపై మొదలైన ఓ రాజకీయ రగడ.. హైదరాబాద్ శివారులోని వట్టినాగులపల్లి వరకు వచ్చిందంటే.. ఈ కథ చిన్నది కాదు. పాత పగపై కొత్త యుద్ధం చేస్తున్నట్టే లెక్క. గత రెండున్నరేళ్ల పాలనలో ఎన్నో స్కామ్‌లు జరిగాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్‌కు.. ఇప్పటివరకు సరైన సాంకేతిక ఆధారాలు లభించలేదు. బట్.. పొంగులేటి క్రషర్ల వ్యవహారంలో గతంలో జారీ అయిన నోటీసులు, జరిమానాల ఆధారాలు దొరకడంతో దీనిని ప్రభుత్వంపై 'అవినీతి' ముద్ర వేయడానికి సరైన ఆయుధంగా బీఆర్ఎస్ భావిస్తోందా? ఇంతకీ.. మంత్రి పొంగులేటి ఇష్యూలో ఏం జరిగింది? బీఆర్ఎస్ ఎందుకని ఇంత ప్రెస్టీజియస్‌గా తీసుకుంది? వెనకున్న కథేంటి?

పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్  పాత పగ.. కొత్త సెగ!
Telangana Assembly Clash

Updated on: Mar 31, 2026 | 9:35 PM

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మైనింగ్ నుంచి వెలుగుమట్లలో కూల్చివేతల దాకా.. బీఆర్ఎస్ అస్త్రాలన్నీ ఇప్పుడు పొంగులేటి అండ్ కో చుట్టూనే. ‘ఇవిగో ఆధారాలు’ అంటూ అసెంబ్లీలో హరీష్ రావు.. ‘పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే’ అంటూ అటు లోక్‌భవన్‌కు కేటీఆర్.. దీన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చారు. ‘ఆరునూరైనా బర్తరఫ్ ముచ్చటే లేదు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అక్రమ మైనింగ్‌కైనా, భూదోపిడీలకు బీఆర్ఎస్ హయాంలోనే పునాదులు పడ్డాయని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. ఒకవైపు మైనింగ్ మంత్రి గడ్డం వివేక్ లెక్కలు తీస్తుంటే.. మరోవైపు ఈ వివాదాన్ని తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌కు ముడిపెట్టి బీఆర్ఎస్ డైలాగ్ వార్ నడుపుతోంది. ఇది కేవలం మైనింగ్ వివాదమా? లేక పొలిటికల్ రివేంజ్ డ్రామానా? అసెంబ్లీ రణరంగంలో పొంగులేటిని బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తోంది? పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్. అసెంబ్లీలో మూడు రోజుల పాటు రణరంగమే జరిగింది ఈ ఇష్యూ పైన. పొంగులేటి సెంట్రిక్‌గా అటు అసెంబ్లీలోనూ, ఇటు బయటా మూకుమ్మడి దాడి చేస్తూపోయింది బీఆర్ఎస్. ఈ మూడునాలుగు రోజుల్లోనే రకరకాల అంశాలను, వివాదాలను తెరమీదకు తీసుకొచ్చింది గులాబీ పార్టీ. ఫస్ట్ ఆరోపణ.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మీద. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి చెందిన ‘రాఘవ కన్స్ట్రక్షన్స్‌’.. నిబంధనలను ఉల్లంఘించి, జంట...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి