Ponguleti Srinivasa Reddy Exclusive Interview: బీఆర్ఎస్ నేతల మాటలను నమ్మి ఆ పార్టీలో చేరానని, ప్రజల్లాగానే తానూ మోసపోయానని, లేకపోతే ఆ నాడే వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యేవాడినని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పార్టీలో తన చేరిక గురించి వివరించారు. వైసీపీ నుంచి తాను ఎంపీగా గెలిచిన తన చుట్టూ రాష్ట్ర విభజన జరిగిన 2 రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ నేతలు తిరిగితేనే తాను వాళ్ల పార్టీలో చేరానని, ఇక్కడ వైసీపీ లేకపోవడంతోనే చేరానని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన తనను బీఆర్ఎస్ నేతలు పదేపదే బతిమాలితేనే వారి మాటలు నమ్మి చేరానని, కానీ ప్రజలు నమ్మి మోసపోయినట్లుగానే తాను మోసపోయానని ఆయన వివరించారు.
అలాగే ‘మేము వద్దని వెళ్లగొట్టినవాళ్లనే మీరు తీసుకుంటున్నారు. మాకు పీడ పోయింది’ అంటూ జూన్ 30న మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై టీవీ9 వేదికగా పొంగులేటి స్పందిచారు. ‘శని మీకు పోయిందా, తగులించుకున్నారా.? అనేది కొన్ని నెలల్లోనే తేలుతుంద’న్నారు. ఇంకా ‘పొంగులేటి, జూపల్లిని సస్పెండ్ చేసింది మేము. ఇక్కడ స్పేస్ లేదని వదిలించుకుంటేనే కాంగ్రెస్ వీళ్లని తీసుకుంది’ అంటూ జూన్ 27న టీవీ9 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ‘మీరు ప్రాధేయ పడి అడిగితే మీ పార్టీలోకి వచ్చాం. మీరు గెలిపిస్తే ప్రజాప్రతినిథిని కాలేదు. మీ భిక్షతో రాజకీయాల్లోకి రాలేదు. స్పేస్ లేదని సస్పెండ్ చేయాలని మీరు మోసం చేయాలనే మీ పార్టీలోకి తీసుకున్నారా కేటీఆర్..?’ అంటూ మంత్రిని పొంగులేటి ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..