Ponguleti Srinivasa Reddy: ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది.. తెలుగు తమ్ముళ్ల మద్దతు కావాలి

|

May 01, 2024 | 3:16 PM

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఓవైపు ఎండ ప్రచండం.. మరోవైపు ప్రచార హోరు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది.. హామీలు.. ఓటర్లను ఆకట్టుకోవడం.. ప్రచారం.. సభలు, సమావేశాలు.. ఇలా అన్ని ప్రాంతాల్లో సందడి నెలకొంది.. ఈ తరుణంలో తెలంగాణ రాజకీయం తెలుగుదేశం వ్యవస్థాపకుడు, నటసార్వభౌముడు ఎన్టీఆర్.. తెలుగు తమ్ముళ్ల వైపు మళ్లింది.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే..

Ponguleti Srinivasa Reddy: ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది.. తెలుగు తమ్ముళ్ల మద్దతు కావాలి
Ponguleti Srinivasa Reddy
Follow us on

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఓవైపు ఎండ ప్రచండం.. మరోవైపు ప్రచార హోరు.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది.. హామీలు.. ఓటర్లను ఆకట్టుకోవడం.. ప్రచారం.. సభలు, సమావేశాలు.. ఇలా అన్ని ప్రాంతాల్లో సందడి నెలకొంది.. ఈ తరుణంలో తెలంగాణ రాజకీయం తెలుగుదేశం వ్యవస్థాపకుడు, నటసార్వభౌముడు ఎన్టీఆర్.. తెలుగు తమ్ముళ్ల వైపు మళ్లింది.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. తాజాగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలోని తెలుగుదేశం కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి తో కలిసి బుధవారం టీడీపీ కార్యాలయానికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అంటూ.. మంత్రి పొంగులేటి ప్రశంసించారు.. అందుకే ఎన్టీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని తెలిపారు. మంచి పనులు చేసిన ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ను ప్రజలు గుర్తుపెట్టుకుంటారంటూ వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలుగు తమ్ముళ్లు మద్దతిచ్చారు.. లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ల మద్దతు కావాలి.. అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని.. తాను, ఖమ్మం అభ్యర్థి రఘురాం పోస్ట్‌కార్డు రాశామన్నారు.

కాగా.. ఇప్పటికే.. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తున్నాయి. అంతకుముందు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయొద్దని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరలేదు.. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నారు. కానీ.. తెలంగాణలో మాత్రం ఏ పార్టీకి కూడా మద్దతును ప్రకటించలేదు.. ఈ తరుణంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఖమ్మంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి మద్దతును కోరడం చర్చనీయాంశంగా మారింది.

వీడియో చూడండి..

ఇలా ఖమ్మంలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంకును అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా మళ్లీ తమవైపు తిప్పుకునేందుకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..