
కొమురవెల్లి(komuravelli) మల్లికార్జునస్వామి దేవాలయంలో హుండీలను ధ్వంసం చేసి, నగదు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను భక్తులు పట్టుకున్నారు. జాతర సాగుతున్నందున హుండీలో డబ్బులు కొట్టేయాలని భావించారు. సీసీ కెమెరాను పక్కకు తిప్పి, హుండీ(Hundi)ని పగలగొట్టారు. అందులోని నగదును సంచిలో నింపుతుండగా భక్తులు గమనించారు. వారికి మాయమాటలు చెప్పి ఏమార్చారు. వారి ప్రవర్తనపై భక్తులకు అనుమానం వచ్చి, పోలీసులకు ఫిర్యాదు(complaint) చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రూ.11వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో పట్టుబడ్డ ఓ వ్యక్తి.. గతంలో ఆలయానికి చెందిన కాంట్రాక్టర్ వద్ద పనిచేసినట్లు గుర్తించారు. అప్పుడు తలనీలాలను అపహరించి, దొంగచాటుగా అమ్ముకుని పట్టుబడటంతో వెళ్లగొట్టారు. మళ్లీ ఇప్పుడు ఏకంగా హుండీలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం గమనార్హం.
ఆదివారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు.. ఆలయం సమీపంలోని చెట్టు వద్ద ఏర్పాటు చేసిన హుండీ తాళాన్ని పగలగొట్టారు. అందులోని డబ్బులను సంచుల్లో నింపుతుండటాన్ని.. అటుగా ప్రదక్షిణలు చేస్తున్న కొందరు భక్తులు గమనించారు. వేళ కాని వేళలో హుండీ నుంచి డబ్బులు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారుర. తాము ఆలయ ఉద్యోగులమని, ఉదయం అయితే రద్దీ ఎక్కువగా ఉంటుందని అందుకే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ సమయంలో హుండీ తెరిచామని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని భక్తులు పక్కనే ఉన్న దుకాణదారులకు చెప్పారు. వారు లోపలికి వచ్చి, ఇద్దరినీ పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. చోరీ చేసేందుకు వచ్చిన వీరు.. సమీపంలో ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాల్లో ఒక కెమెరా దిశ మార్చారు. మిగతా మూడు కెమెరాలను గమనించలేదు. దీంతో దొంగతనానికి ప్రయత్నిస్తున్న వీరి తతంగమంతా సీసీ ఫుటేజీలో రికార్డైంది.
ఆలయ ఈవో ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.
Also Read
కుమార్తె గొంతు నులిమి చంపిన తల్లి.. ప్రియుడితో కలిసి దారుణం.. అసలేం జరిగిందంటే..
Hair Dyes: జుట్టుకు కలర్ వేస్తున్నారా.. అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లే.. ఎందుకంటే..