Madhavi Latha: బీజేపీ అభ్యర్థి మాధవీలతపై పీఎం మోడీ ప్రశంసల జల్లు.. ఎందుకంటే

|

Apr 07, 2024 | 9:29 PM

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో ఆమె లేవనెత్తిన అంశాలు ప్రధాని మోదీని ఆకట్టుకున్నాయి. 'మాధవీ లతా గారూ, మీ 'ఆప్ కీ అదాలత్' ఎపిసోడ్ అద్భుతంగా ఉంది.

Madhavi Latha: బీజేపీ అభ్యర్థి మాధవీలతపై పీఎం మోడీ ప్రశంసల జల్లు.. ఎందుకంటే
Madhavi Latha
Follow us on

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో ఆమె లేవనెత్తిన అంశాలు ప్రధాని మోదీని ఆకట్టుకున్నాయి. ‘మాధవీ లతా గారూ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. మీరు చాలా సాలిడ్ పాయింట్స్ ఇచ్చారు. మీకు నా శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ ఆదివారం ట్విట్టర్ లో ఓ పోస్ట్ ద్వారా తెలియజేశారు.

ఈ కార్యక్రమం రిపీట్ టెలికాస్ట్ ను అందరూ చూడాలని కోరుతున్నాను. మీ అందరికీ ఇది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది’ అని కూడా మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రశంసలపై మాధవీలత హర్షం వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని ఇచ్చింది మీరేనని, తమ పార్టీ ఆదర్శం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ తనకు స్ఫూర్తి అని ఆమె కృతజ్ఞతను వ్యక్తం చేశారు. మా చివరి శ్వాస వరకు మీ బాటలోనే నడుస్తామని, ఈసారి హైదరాబాద్ లో  బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వ్యాపారవేత్త, దాత మాధవి లతను బీజేపీ గత నెలలో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది.

వృత్తిరీత్యా భరతనాట్య కళాకారిణి అయిన మాధవీలత ఏనాడూ క్రియాశీలక రాజకీయ నాయకురాలు కాదు. అయితే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఎదుర్కొనేందుకు పార్టీ ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాతే బీజేపీలో చేరారని తెలిపారు. హిందుత్వ ప్రసంగాలకు పేరుగాంచిన మాధవీలత ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. లతమ్మ ఫౌండేషన్, చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీగా నిరుపేద ముస్లిం మహిళల కోసం పాటు పడుతున్నారు.