PM Modi’s Hyderabad Visit Highlights: కేసీఆర్‌ టార్గెట్‌గా మోదీ షాకింగ్ కామెంట్స్‌.. కుటుంబ పాలనకు త్వరలోనే చెక్.. అధికారంలోకి బీజేపీ..!

|

May 26, 2022 | 4:42 PM

8 Years of Modi Government Updates: తెలంగాణను విచ్ఛన్నం చేసేవారు నాడు నేడూ ఉన్నారని మోడీ పేర్కొన్నారు. అమర వీరుల త్యాగాలు ఒక్క కుటుంబం కోసం కాదని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ త్యాగం చేశారని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.

PM Modis Hyderabad Visit Highlights: కేసీఆర్‌ టార్గెట్‌గా మోదీ షాకింగ్ కామెంట్స్‌.. కుటుంబ పాలనకు త్వరలోనే చెక్.. అధికారంలోకి బీజేపీ..!
Pm Modi At Isb

PM Modi Hyderabad Visit U News:  ప్రధాని మోదీ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్నాతకోత్సవానికి హాజరుకానున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు ప్రధాని. షెడ్యూల్ కంటే ముందే అంటే మధ్యాహ్నం 12.50 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు ప్రధాని మోదీ. ISB 20వ వార్షికోత్సవానికి హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట్ ఎయిర్‌పోర్టులో బీజేపీ నాయకులను కలవనున్నారు. 1.45 వరకు ఎయిర్ పోర్టు పార్కింగ్‌లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ISB ప్రాంగణానికి రానున్నారు. ISB స్నాతకోత్సవంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 930 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్ ISB నుంచే కాకుండా మొహాలీ ISB నుంచి సైతం 330 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ వస్తుండడంతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. పంజాబ్ రైతుల ఆందోళనల నేపథ్యంలో పంజాబ్ నుంచి వస్తున్న ప్రతి విద్యార్థి బ్యాక్ గ్రౌండ్‌ను వెరిఫై చేస్తున్నారు భద్రతా అధికారులు. సోషల్ మీడియా అకౌంట్లపైనా దృష్టి పెట్టారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతునట్టు ప్రకటించారు. కేబుల్ బ్రిడ్జి నుంచి వచ్చే వాహనాలు మదాపూర్ హైటెక్స్ మీదుగా.. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్ మీదుగా.. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చే వాహనాలు హెచ్‌యూ డిపో నుంచి బొటానికల్ గార్డెన్ మీదుగా డైవర్షన్ ఏర్పాటు చేశారు పోలీసులు. నాలుగు గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి చెన్నై బయలుదేరి వెళ్తారు. మొత్తం నాలుగు గంటల మోడీ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. Isb, బేగంపేట ఎయిర్ పోర్ట్ దగ్గర కట్టుదిట్టమైన ఆంక్షలను విధించారు.మొత్తం 1500 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 May 2022 03:55 PM (IST)

    బేగంపేట విమానాశ్రయం నుంచి చెన్నై బయల్దేరిన ప్రధాని మోడీ

    బేగంపేట విమానాశ్రయం నుంచి చెన్నైకు ప్రధాని మోడీ బయల్దారారు.

  • 26 May 2022 03:31 PM (IST)

    ఐఎస్బీ నుంచి బేగంపేట వరకు రోడ్డు మార్గం ద్వారా…

    హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. ఐఎస్‌బిలో జరిగిన 20వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు మోదీ. జీ 20 దేశాల్లో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం. ఐఎస్బీ నుంచి బేగంపేట వరకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్న ప్రధాని మోడీ.

  • 26 May 2022 03:24 PM (IST)

    వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో సమన్వయం చేసుకోవాలి – ప్రధాని మోడీ

    వ్యక్తిగత లక్ష్యాలను దేశ లక్ష్యాలతో సమన్వయం చేసుకోవాలన్నారు ప్రధాని మోడీ. యువత ఆలోచనలను దేశ పురోభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. రిఫార్మ్‌, పర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని గుర్తు చేశారు. విద్యార్థులు బయటకు వచ్చాక పాలసీ విధానాలు రూపొందిస్తారని.. పాలసీ విధానాలు గదుల్లో, కాగితాలకు మాత్రమే పరిమితం కావద్దన్నారు. రూపొందించిన విధానాలు క్షేత్రస్థాయిలో అమలైతేనే సార్థకత ఉంటుందన్నారు. దేశంలో సంస్కరణల అవసరం ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

  • 26 May 2022 03:18 PM (IST)

    స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగంలో మనం టాప్..

    జీ 20 దేశాల్లో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందన్నారు ప్రధాని మోడీ. స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగదారుల జాబితాలో దేశం అగ్రస్థానంలో ఉంది. అంతర్జాల వినియోగదారుల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ప్రధానిస్టార్టప్‌ల రూపకల్పనలో భారత్‌ మూడో స్థానంలో ఉంది. వినియోగదారుల మార్కెట్‌లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. కరోనా విపత్తు వేళ భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది. కరోనా కారణంగా గొలుసు సరఫరా వ్యవస్థ దెబ్బతిందని గుర్తు చేశారు ప్రధాని మోడీ.

  • 26 May 2022 03:10 PM (IST)

    ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక స్టార్టప్‌లు రూపొందింస్తున్నారు- ప్రధాని మోడీ

    ఐఎస్‌బీ హైదరాబాద్‌ మరో మైలురాయి అందుకుందని ప్రధాని మోడీ అన్నారు. ఐఎస్‌బీ నుంచి ఇప్పటివరకు 50 వేల మంది బయటకు వెళ్లారని.. ఐఎస్‌బీ విద్యార్థులు దేశానికి గర్వకారణమని అభివర్ణించారు. ఇక్కడి విద్యార్థులు ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని.. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక స్టార్టప్‌లు రూపొందించారని తెలిపారు. 25 ఏళ్ల నాటి సంకల్పానికి మీ అందరిదీ ముఖ్య పాత్ర గుర్తు చేశారు ప్రధాని మోడీ.

  • 26 May 2022 03:07 PM (IST)

    ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నం ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

    ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నం ఆవిష్కరించారు ప్రధాని మోదీ.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు. ఐఎస్‌బీ స్కాలర్లకు ఎక్సలెన్స్‌, లీడర్‌షిప్‌ అవార్డులు అందించారు. ఐఎస్‌బీ స్కాలర్లు అభిజిత్‌, భరద్వాజ్‌, వైదేహీకి గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు. ఐఎస్‌బీ స్కాలర్లు విక్రమ్‌ సింగ్‌, ఉత్కర్ష్‌, ప్రదీప్‌కు గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు. విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం చేసిన అనంతరం రాఘవ్‌ చోప్రాకు హైదరాబాద్‌ క్యాంపస్‌ ఛైర్‌పర్సన్‌ అవార్డు అందించారు

  • 26 May 2022 02:18 PM (IST)

    ISBకి చేరుకున్న ప్రధాని మోడీ

    ISBకి ప్రధాని మోడీ చేరుకున్నారు. ISB ప్రాంగణానికి రానున్నారు. ISB స్నాతకోత్సవంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 930 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్ ISB నుంచే కాకుండా మొహాలీ ISB నుంచి సైతం 330 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

  • 26 May 2022 01:42 PM (IST)

    నేను సాంకేతికతను నమ్ముతాను.. అంధ విశ్వాసాలను కాదు.. – ప్రధాని మోడీ

    భారత ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తున్నారు. ఈ 8 ఏళ్లల్లో వేల స్టార్టప్‌లను ప్రోత్సహించారు. నాకు టెక్నాలజీ పైన అపారమైన నమ్మకం ఉంది. నేను సాంకేతికతను నమ్ముతాను, అంధ విశ్వాసాలను నమ్మను. అంధవిశ్వాసులతో తెలంగాణకు ప్రయోజనం లేదు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాలి. 2024లో విముక్తి కలుగుతుందనే నమ్మకం నాకుంది. మేం పారిపోయే వాళ్లం కాదు, పోరాడే వాళ్లం. బీజేపీ కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు, నెగ్గే వాళ్లని ప్రశ్నించారు ప్రధాని మోడీ.

  • 26 May 2022 01:39 PM (IST)

    తెలంగాణలో మార్పు మొదలైంది – ప్రధాని మోడీ

    కుటుంబ పాలన రాష్ట్రానికే కాదు.. దేశానికే ప్రమాదం అని అన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో మార్పు మొదలైందనే విషయం ఇక్కడి భూమ్మీద అడుగు పెట్టగానే అర్థమైందని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమావ్యక్తం చేశారు. కుటుంబ పాలనలో బంధీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కలిగిస్తామని చెప్పారు. కుటుంబ పార్టీలను తరిమిస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పోరాటమైనా చేస్తామని స్పష్టం చేశారు.

  • 26 May 2022 01:30 PM (IST)

    తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష: ప్రధాని మోడీ

    తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ప్రభుత్వ ఆకాంక్షం. ప్రధాని కుటుంబ పార్టీలను తరిమిస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పోరాటమైనా చేస్తాం.

  • 26 May 2022 01:22 PM (IST)

    అమర వీరుల త్యాగాలు ఒక్క కుటుంబం కోసం కాదు – ప్రధాని మోడీ

    తెలంగాణను విచ్ఛన్నం చేసేవారు నాడు నేడూ ఉన్నారని మోడీ పేర్కొన్నారు. అమర వీరుల త్యాగాలు ఒక్క కుటుంబం కోసం కాదని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ త్యాగం చేశారని మోడీ పేర్కొన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మోడీ ఆవేదన వ్యక్తంచేశారు. సర్దార్ పేటల్ స్ఫూర్తితో ఉద్యమించాలని సూచించారు. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించారు.

  • 26 May 2022 01:18 PM (IST)

    టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ – ప్రధాని మోడీ

    తెలంగాణ కోసం అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ప్రధానిభారత దేశ ఐక్యత కోసం సర్దార్‌ పటేల్‌ ఎంతో కృషి చేశారు. టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు.

  • 26 May 2022 01:15 PM (IST)

    మీ అభిమానమే నా బలం – ప్రధాని మోడీ

    బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ ప్రాగంగనంలో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీ అభిమానమే నా బలం అంటూ ప్రధాని మోడీ తన ఉపన్యాసం ప్రారంభించారు. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలు మరోపేరని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ఎప్పుడొచ్చినా మీరు రుణం పెరిగిపోతుందని.. ప్రధాని మోడీ పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ.. హైదారాబాద్ విమానాశ్రయంలో బీజేపీ సభలో ప్రసంగించారు. మొదట తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ.. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • 26 May 2022 01:11 PM (IST)

    బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ

    బేగంపేట ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నారు.

  • 26 May 2022 01:07 PM (IST)

    ప్రత్యేక విమానం ద్వారా గచ్చిబౌలికి ప్రధాని మోడీ..

    బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ శ్రేణులతో సమావేశం జరిగిన తర్వాత  airport నుంచి ప్రత్యేక విమానం ద్వారా గచ్చిబౌలి చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ISB ప్రాంగణానికి రానున్నారు. ISB స్నాతకోత్సవంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 930 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్ ISB నుంచే కాకుండా మొహాలీ ISB నుంచి సైతం 330 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

  • 26 May 2022 01:00 PM (IST)

    స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై

    బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్‌ తమిళిసై స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో గవర్నర్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.

  • 26 May 2022 12:57 PM (IST)

    బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ..

    బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు ప్రధాని మోడీ. షెడ్యూల్ కంటే ముందే అంటే మధ్యాహ్నం 12.50 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఆయనకు వివిధ కాలేజీల విద్యార్థులు, బీజేపీ శ్రేణులు స్వాగతం పలికేందుకు జాతీయ జండాలతో అక్కడికి చేరుకున్నారు.

  • 26 May 2022 12:29 PM (IST)

    స్నాతకోత్సవంలో ప్రసంగించనున్న ప్రధాని మోడీ

    ISB స్నాతకోత్సవంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 930 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్ ISB నుంచే కాకుండా మొహాలీ ISB నుంచి సైతం 330 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.

  • 26 May 2022 12:28 PM (IST)

    పార్కింగ్‌లో ఉండే బీజేపీ శ్రేణులకు అభివాదం..

    మరో పది నిమిషాలు airport పార్కింగ్‌లో ఉండే బీజేపీ శ్రేణులకు అభివాదం చేస్తారు. కుదిరితే వారిని ఉద్దేశించి ప్రసంగం కూడా చేసే అవకాశం ఉంది. రెండు గంటలకు ఐఎస్‌బికి బయల్దేరి వెళ్తారు. Isbలో గంటన్నర పాటు వివిధ కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు.

  • 26 May 2022 12:26 PM (IST)

    సమయం కంటే ముందుగానే హైదరాబాద్‌కు ప్రధాని మోడీ..

    ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి తెలంగాణకు వస్తున్నారు. షెడ్యూల్‌ కంటే ముందుగానే బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అధికారికంగా పూర్తి షెడ్యూల్ ఇచ్చింది పీఎంవో.మధ్యాహ్నం ఒకటిన్నరకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు నరేంద్రమోదీ. దాదాపు 20 నిమిషాల పాటు ఎయిర్‌పోర్టులో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.

Follow us on