Cocks In Lockup: కటకటాల వెనుక కోడిపుంజులు… అవి చేసిన నేరం ఏమిటో తెలుసా..!

సంక్రాంతి పండుగ సంబరాలు అయ్యి దాదాపు 20 రోజులు కావస్తున్నా. కొంత మంది యువకులకు కోడి పందేల సరదా తీరలేదు. ఆ యువకుల సరదాకు ఆరుబయట స్వేచ్ఛగా తిరగాల్సిన కోడిపుంజులు..

Cocks In Lockup: కటకటాల వెనుక కోడిపుంజులు...  అవి చేసిన నేరం ఏమిటో తెలుసా..!

Updated on: Feb 04, 2021 | 7:10 AM

Cocks In Lockup: సంక్రాంతి పండుగ సంబరాలు అయ్యి దాదాపు 20 రోజులు కావస్తున్నా. కొంత మంది యువకులకు కోడి పందేల సరదా తీరలేదు. ఆ యువకుల సరదాకు ఆరుబయట స్వేచ్ఛగా తిరగాల్సిన కోడిపుంజులు ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో కొందరు యువకులు ఆంధ్రా యువకులతో కలిసి కోడి పందేలను నిర్వహిస్తున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు దాడి చేసి.. పందేలు నిర్వహిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడ పందెంలో పాల్గొన్న కోడిపుంజులు కూడా అదుపులోకి తీసుకుని .. తర్వాత వాటిని లాకప్ లో పెట్టారు.. అనంతరం వాటికి ఆహారాన్ని అందిస్తున్నారు. పందాల్లో పాల్గొన్న కోడిపుంజు గాయాలపాలై.. మాంసంగా మారాల్సింది. అయితే అవి జైల్లో దర్జాగా పోలీసులు వేస్తున్న గింజలను తింటున్నాయి.

Also Read: