Bhadradri Kothagudem: పోలీస్ స్టేషన్‌లో బంధీలుగా పందెం కోళ్లు.. నాలుగు రోజులుగా పహారా కాస్తున్న పోలీసులు..

Bhadradri Kothagudem: ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వినటానికి కాస్త విడ్డురంగా ఉన్నా అది నిజంగా నిజం. సాధారణంగా.. ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే.. వారిని పోలీసులు అరెస్టు చేయడం..

Bhadradri Kothagudem: పోలీస్ స్టేషన్‌లో బంధీలుగా పందెం కోళ్లు.. నాలుగు రోజులుగా పహారా కాస్తున్న పోలీసులు..
Rooster

Updated on: Oct 29, 2021 | 1:23 PM

Bhadradri Kothagudem: ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వినటానికి కాస్త విడ్డురంగా ఉన్నా అది నిజంగా నిజం. సాధారణంగా.. ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే.. వారిని పోలీసులు అరెస్టు చేయడం.. ఠాణాల్లోని సెల్ లో ఉంచటం కామన్. కానీ కోళ్లను అరెస్ట్ చేయడం ఎప్పుడైనా చూశారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులుగా పందెం కోళ్లకు ఠాణాలో పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఆ పందెం కోళ్లకు ఠాణాలో పనిచేసే సిబ్బంది రేషన్ బియ్యాన్ని ఆహారంగా అందిస్తూ వాటికి పహారా కాస్తున్నారు. కోళ్లను అదుపులోకి తీసుకోవడం ఏంటి? నాలుగు రోజులుగా ఠాణాలో ఉంచుకోవడం ఏంటి? పహారా కాయడం ఏంటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం దంతలబోరు శివారు అటవీ ప్రాంతంలో ఈనెల 25న కోడి పందేలు నిర్వహించారు. ఈ కోడి పందేలకు సంబంధించి సమాచారం అందుకున్న పాల్వంచ రూరల్ ఎస్సై సుమన్.. తన సిబ్బందితో కలిసి కోడి పందేలు నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లారు. పందెం కోళ్ళ స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా మూడు పందెం కోళ్లతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. అనంతరం ఆ పందెం రాయుళ్ళకు పోలీసులు నోటీసులు జారీ ఇచ్చి పంపిచేశారు. కానీ పోలీసులు మాత్రం ఆ పందెం కోడిపుంజులను నేటికీ విడుదల చేయలేదు. కిన్నెరసాని రూరల్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలోనే కోడి పుంజులను బంధించారు. పుంజుల రంగుల ఆధారంగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అంటే అప్పటి వరకు ఆ కోళ్లకు పోలీసుల సంరక్షణలో ఉంటాయన్నమాట.

Also read:

Janasena Party: బీజేపీ చేసే ప్రతిదీ ఒప్పుకోవడానికి మేం డూడూ బసవన్నలం కాదు.. జనసేన నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. పండుగ ముందు 3 కిలోల చక్కెర పంపిణీ.. ఎక్కడంటే..?

Pollock Sisters: సైన్స్‌కి అందని అద్భుతం.. చనిపోయి మళ్లీ అదే తల్లికి పుట్టిన కవలలు.. వీడియో