Graduate MLC Elections Telangana: వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ బి ఫాం ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. ఇవాళ ప్రగతి భవన్‌లోని సీఎం ఆఫీసులో పల్లాకు బి ఫాం ను ఇచ్చారు సీఎం కేసీఆర్. వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పల్లా రాజేశ్వర్ రెడ్డికి బి ఫాం అందజేశారు. కాగా, మార్చి 14న గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ పోలింగ్ ఫలితాలను మార్చి 17వ తేదీన వెల్లడిస్తారు. ఇకపోతే.. ప్రస్తుతం వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయన పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. దాంతో ఎన్నికల ప్రక్రియను మార్చి 22 నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
ఇదిలాఉండగా, వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు స్వతంత్రులుగా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, రాణీ రుద్రమ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం పోటీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్నికల కోసం ప్రచారం కూడా సాగిస్తున్నారు.
Also read: