Telangana: ఢిల్లీ చుట్టూ తెలంగాణ రాజకీయం.. సీఎం రేవంత్‌రెడ్డి టూర్‌పై విపక్షాల విమర్శలు.. ఈ క్రమంలోనే..

|

Mar 13, 2024 | 9:48 AM

తెలంగాణ రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్‌లపై టార్గెట్‌ చేశాయి విపక్షాలు. కరీంనగర్ కదనభేరి సభలో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్‌లపై ప్రశ్నలు సంధించారు మాజీ సీఎం, బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో దౌర్జన్యంగా దోపిడీ చేసి.. ఢిల్లీకి మళ్లీ సూట్‌ కేసులు పంపుతున్నరు.. ఆ పని మీద ఫుల్‌ బిజీగా ఉన్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

Telangana: ఢిల్లీ చుట్టూ తెలంగాణ రాజకీయం.. సీఎం రేవంత్‌రెడ్డి టూర్‌పై విపక్షాల విమర్శలు.. ఈ క్రమంలోనే..
KCR - Revanth Reddy - Kishan Reddy
Follow us on

తెలంగాణ రాజకీయం ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్‌లపై టార్గెట్‌ చేశాయి విపక్షాలు. కరీంనగర్ కదనభేరి సభలో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్‌లపై ప్రశ్నలు సంధించారు మాజీ సీఎం, బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో దౌర్జన్యంగా దోపిడీ చేసి.. ఢిల్లీకి మళ్లీ సూట్‌ కేసులు పంపుతున్నరు.. ఆ పని మీద ఫుల్‌ బిజీగా ఉన్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌ టూ ఢిల్లీ.. ఢిల్లీ టూ హైదరాబాద్‌ తిరుగుతున్నరని ఫైర్ అయ్యారు. మూడునెలల్లో తొమ్మిదిసార్లు పోతరా? ఇన్ని యాత్రలా? ఏం జరుగుతుంది ? మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర.. పాదాల దగ్గర తాకట్టుపెట్టి.. మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నరని విమర్శించారు కేసీఆర్..

రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూటికేసులు పంపుతున్నారని.. తెలంగాణలో రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ ఇప్పటికే పలుసార్లు విమర్శించారు తెలంగాణ బీజేపీ ఛీప్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. రాహుల్‌ గాంధీ ట్యాక్స్‌ పేరు మీద కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

విపక్షాల ఆరోపణలు ఎక్కుపెడుతుంటే.. ఇవాళ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం ఢిల్లీలో జరగనున్న పార్టీ సీఈసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మిగతా స్థానాల్లో అభ్యర్థులపై ఇవాళ చర్చించి ఫైనల్ చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఒకరిద్దరు మంత్రులు కూడా వెళ్లే అవకాశముందని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..