
కలుపు మొక్కలను వేర్లతో సహా నివారించగలిగిన విషానికి.. మనిషి చంపడం ఒక లెక్కా..! జీవితంపై విరక్తి పుట్టి క్షణికావేశానికి లోనవుతున్న వారిని సునాయసంగా మృత్యువు ఒడికి చేరుస్తోంది ఈ పారాక్వాట్ గడ్డిమందు. ‘అదృష్టం కొద్దీ బతికాడు’ అని చెప్పుకోడానికి కూడా లేదు ఇది తాగిన వాళ్లు. గడ్డి మందు తాగి బతికిన కొద్ది మంది ఏదో ఒక అవయమాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వాళ్లు కూడా ఎక్కువ కాలం జీవించే పరిస్థితి ఉండదు. అందుకే, ఇలాంటి విషాన్ని నిషేధించాలని కరీంనగర్‌కు చెందిన డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి కొన్నేళ్లుగా అవగాహన సదస్సులు పెట్టి పోరాటం చేస్తున్నారు. W.H.O.కి ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ కూడా ఎప్పుడో స్టేట్‌మెంట్ ఇచ్చింది. మన పార్లమెంట్‌లో సైతం కొందరు ఎంపీలు ఈ పారాక్వాట్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడ్డిపై పారాక్వాట్ చల్లి.. అలా చూస్తూ ఉండండి. గంటల్లోనే ఆ గడ్డిని మాడ్చేస్తుందా మందు. రైతులకు బాగా తెలుసు దాని పవర్ ఏంటో. అలాంటి గడ్డి మందును మనిషి తాగితే? మొక్కలు మాడినట్టే ముందుగా పెదాలు కాలిపోతాయి. నోటి నుంచి గొంతు లోపలి దాకా కాలిన గాయాల్లా పుండ్లు పడతాయి. వాంతులు, విరేచనాలు....