Vande Bharat: సికింద్రాబాద్‌ – విశాఖ వందే భారత్‌ రైలు షెడ్యూల్‌లో మార్పులు.. పూర్తి వివరాలు..

|

Feb 16, 2023 | 12:25 PM

రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. సికింద్రబాద్-విశాఖపట్నంల మధ్య నడుస్తోన్న రైలు సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ మార్పు కేవలం నేడు ఒక్కరోజుకే (గురవారం) పరిమితమని అధికారులు తెలిపారు...

Vande Bharat: సికింద్రాబాద్‌ - విశాఖ వందే భారత్‌ రైలు షెడ్యూల్‌లో మార్పులు.. పూర్తి వివరాలు..
ఇక వందేభారత్ రైలు ప్రారంభమైతే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి.. 12 గంటలు కాస్తా.. ఇకపై ఆరున్నర గంటల నుంచి 7 గంటల ప్రయాణం అవుతుంది.
Follow us on

రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. సికింద్రబాద్-విశాఖపట్నంల మధ్య నడుస్తోన్న రైలు సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ మార్పు కేవలం నేడు ఒక్కరోజుకే (గురవారం) పరిమితమని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ – విశాఖపట్నంల మధ్య నడిచే 2084 నెంబర్‌ ట్రైన్‌ సికింద్రబాద్‌ నుంచి 15.00 గంటలకు బయలుదేరాల్సిన రైలు 16-02-2023 రోజున 17.30 గంటలకు బయలు దేరనుంది. అంటే రైలు ఏకంగా రెండున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరనుందన్నమాట. విశాఖ నుంచి బయలు దేరిన రైలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకోవడం కారణంగానే రైలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే విశాఖ-సికింద్రాబాద్‌ల మధ్య వందే భారత్‌ రైలును ప్రధాని నరేంద్రమోదీ జనవరి 15వ తేదీన వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ సర్వీసులు జనవరి 16 నుంచి ప్రారంభమయ్యాయి. దేశంలో 8వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుగా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక తాజాగా సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి మరో వందే భారత్‌ రైలు సేవలను ప్రారంభించేందుకు ఇండియన్‌ రైల్వే సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..