మటన్ లవర్స్.. ప్రతి పార్ట్తోనూ లాభమే.. కుమ్మండిక..
Prudvi Battula
Images: Pinterest
14 December 2025
వారానికి ఒక్కసారి మటన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయి. అయితే మటన్ వేయించిన, గ్రిల్ చేసిన ఇందులో కొవ్వు శాతం పెరుగుతుంది.
మటన్
మటన్ లివర్‌లో ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తాయి. ఇది రక్త హీనతను తగ్గిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది.
మటన్ లివర్
మేక కాళ్లను కాల్చి సూప్ తయారు చేసుకొని తాగితే. అంటు వ్యాధులు దూరం అవుతాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.
మేక కాళ్ళు
మటన్ బోన్ సూప్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది జలుబును దూరం చేస్తాయి. అలాగే విరిగిన ఎముకలను నయం చేస్తాయి.
మటన్ బోన్స్
అలాగే తరచూ మటన్ బోన్ సూప్ తాగితే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఎముకలకు బలం చేకూరుతుంది.
మటన్ బోన్ సూప్
మేక తలకాయ ఐరన్, ప్రొటీన్లకి మంచి మూలం. ఇది కాల్చి ముక్కలుగా చేసి కూర వండుకుని చపాతీ, రైస్‌తో తింటే చాలా బాగుంటుంది.
మేక తలకాయ
రెడ్ మీట్ అంటే ఇష్టపడని వారికి మేక తలకాయ కూర మంచి ప్రత్యామ్నాయం. ఇది తినడం వల్ల శరీరం గట్టిపడుతుంది.
రెడ్ మీట్‌కి ప్రత్యామ్నాయం
మటన్ బోటీ (పేగులు)లో విటమిన్ ఎ, బి12, డి, ఈ, కె ఎక్కువగా ఉంటాయి. వీటిని ఫ్రై చేసుకుని తింటే ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.