Telangana Corona Cases: కంటైన్మెంట్ జోన్‌గా కాళేశ్వ‌రం.. భ‌క్తుల‌కు నో ఎంట్రీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. జిల్లాలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌...

Telangana Corona Cases: కంటైన్మెంట్ జోన్‌గా కాళేశ్వ‌రం.. భ‌క్తుల‌కు నో ఎంట్రీ
Kaleswaram

Updated on: Jun 04, 2021 | 11:01 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. జిల్లాలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్‌ అమలుతో కేసులు కొద్దిగా అదుపులోకి వచ్చినప్పటికీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికంగా పాజిటివ్‌ కేసులు ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు అధికారులు. ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో గ్రామాన్నికంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు అధికారులు. కాళేశ్వరం వచ్చే వాహనాలను మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ వద్ద నుండి వెనక్కి పుంపిస్తున్నారు పోలీసులు. కాలేశ్వరం వచ్చే భక్తులను వెనక్కి పంపిస్తున్నారు. మహదేవపూర్ మండలం బొమ్మ పూర్ క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కాళేశ్వరం ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కాళేశ్వరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో, కంటైన్మెంట్ జోన్ గా ఏర్పాటు చేశారు. కరోనా కేసులు తగ్గే వరకు కాళేశ్వరం ఆలయానికి భక్తులెవరూ రావొద్దని పోలీసులు సూచించారు. కాగా క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు గుళ్లు మూసివేసిన విష‌యం తెలిసిందే.

Also Read: ఇండియ‌న్ ఆర్మీలో ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..

పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. జీవన్‌ అక్షయ్‌ పాలసీతో రూ.86 వేల ఆదాయం పొందండి

Loading...
Unable to load recommendations.
Follow Us