
School Holidays: ఇప్పుడు పండగ సీజన్ ముగిసింది. దసరా, దీపావళి సెలవులు ముగిశాయి. అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అక్టోబర్లో భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు నవంబర్ నెల మొదలైంది. ఈనెలలో మొదటి వారంలో కూడా సెలవులు రానున్నాయి. సహజంగానే సెలవులంటే ఇష్టపడే విద్యార్థులు ఈనెలలో కూడా ఎన్నిరోజులు సెలవులు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులు కూడా నవంబర్ సెలవుల సమాచారం కోసం హాలిడేస్ జాబితాను పరిశీలిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే అక్టోబర్ మాదిరిగానే నవంబర్ లో కూడా ఫస్ట్ వీక్ లో వరుస సెలవులు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ అదే జోరు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతంటే..
ఈ నెల మొదటి వారంలోనే మొత్తం నాలుగు రోజులు విద్యాసంస్థలు, ఆఫీసులు మూతపడనున్నాయి. నవంబర్ 2 ఆదివారం సాధారణంగా ఈ రోజు అందరికీ సెలవే ఉంటుంది. ఆదివారం సెలవు ముగిసి ఓ రెండ్రోజులు స్కూళ్లు యధావిధిగా కొనసాగుతాయో లేదో నవంబర్ 5 (బుధవారం) మరో సెలవు వస్తోంది. ప్రస్తుతం కార్తీకమాసం కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేవాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఈ నెలను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందులోనూ ఈ నెలలో వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. అందుకే ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అలాగే 5న గురునానక్ జయంతి కూడా ఉంది. దీంతో సెలవు ఉండే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: CM Revanth: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రూ.5 లక్షలు
కార్తీక పౌర్ణమి సెలవు ముగియగానే నవంబర్ 6,7 (గురు, శుక్ర) పాఠశాలలకు రెండో శనివారం. ) స్కూళ్ళు కొనసాగుతాయి. ఇక నవంబర్ 8 రెండో శనివారం, మరుసటి రోజు ఆదివారం. ఇలా రెండు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి. మొత్తం మీద చూసుకుంటే నవంబర్ 2, 5, 8, 9 తేదీల్లో సెలవులే.
విద్యాసంస్థల యాజమాన్యల సమ్మె
అధికారిక సెలవులతో పాటు నవంబర్ లో అనధికారిక సెలవులు కూడా విద్యాసంస్థలకు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కళాశాలలు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల కోసం ఉద్యమానికి సిద్దమయ్యాయి. నవంబర్ 1 లోపు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని, లేదంటే నవంబర్ 3 నుండి నిరవధికంగా విద్యాసంస్థల బంద్ చేపడతామని ”ది ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్” ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. సమ్మె కనుక చేపట్టినట్లయితే విద్యాసంస్థలకు నవంబర్లో వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: LPG Gas Price: వినియోగదారురులకు శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!