Note for Vote Case: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. ఏం జరగబోతోంది..?

|

Apr 17, 2024 | 9:28 PM

ఓటుకు నోటు కేసుపై గురువారం విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునివ్వనుంది...? ఏడేళ్ల విచారణకు గురువారం ఫుల్‌స్టాప్‌ పడనుందా...? కేసులో చంద్రబాబు పాత్రపై క్లారిటీ వస్తుందా...?

Note for Vote Case: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. ఏం జరగబోతోంది..?
Note For Vote Case - Chandrababu
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 18, గురువారం విచారణ జరగనుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ కేసును సుప్రీం కోర్టు విచారించనుంది. ఇకపోతే ఓటుకు నోటు కేసు విషయమై ఇప్పటికే రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును చేర్చాలని ఒక పిటిషన్ దాఖలు చేయగా….కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. ఇక సుప్రీంకోర్టులో ఆ రెండు పిటిషన్లు విచారణకి వచ్చినప్పటికీ… పలుమార్లు విచారణ వాయిదా పడింది. దీంతో గురువారం విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల వేళ ఎలాంటి తీర్పు వస్తుందా…? అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

మరోవైపు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తరుపు న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఏడేళ్లుగా కేసును కావాలనే సాగదీస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీరునూ తప్పుబట్టారు.

తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్న ఆరోపణలతో 2015లో ఈ ఓటుకు నోటు కేసు ఫైల్ అయ్యింది. అయితే సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్లారు. ఇక అప్పట్నుంచి కేసు వాయిదా పడుతూ వస్తోంది. గత ఐదు నెలల్లోనే పలు కారణాలు చూపి చాలా వాయిదాలు కోరారు చంద్రబాబు తరుపు న్యాయవాదులు. దీంతో గురువారం విచారణ, కోర్టు తీరుపై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…