Weather Today: వారం రోజుల పాటు నో రెయిన్స్.. ముఖం చాటేసిన వరుణుడు.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదే..

తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే వారం రోజులు వర్షాలు లేనట్లేనని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు మందగించడం, ఎల్‌నీవో ఎఫెక్ట్ వల్ల వానలు పడే అవకాశం లేదని తెలిపింది. సాాధారణంగా జులైలో భారీ వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సారి

Weather Today: వారం రోజుల పాటు నో రెయిన్స్.. ముఖం చాటేసిన వరుణుడు.. వాతావరణశాఖ లేటెస్ట్ అప్డేట్ ఇదే..
Summer

Updated on: Jul 16, 2026 | 10:31 AM

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ బ్యాడ్ న్యూస్ అందించింది. వర్షాలపై కీలక ప్రకటన జారీ చేసింది. వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని అంచనా వేసింది. ఎల్‌నీవో ప్రభావం, ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా రాబోయే వారం రోజులు వానలు పడే ఛాన్స్ తక్కువగా ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గత రెండు, మూడు రోజులుగా ఎండలు పెరుగుతున్నాయి. వాతావరణం వేసవి కాలాన్ని తలపిస్తోంది. ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మరో వారం భానుడి ప్రతాపం ఇలాగే కొనసాగుతుందని వాతావరణశాఖ చెబుతోంది. భానుడి తన ఉగ్రరూపాన్ని పెంచుతుండటంతో ప్రజలు మళ్లీ ఏసీలు, కూలర్లను వినియోగిస్తున్నారు.

ముఖం చాటేసిన వరుణుడు

సాధారణంగా నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వర్షాకాలం మొదలైనా వాన జాడ కనిపించడం లేదు. సాధారణంగా జులైలో వర్షాలు భారీగా కురుస్తాయి. కానీ ఈసారి వాతావరణం చూస్తే వేసవి కాలాన్ని తలపిస్తోంది. తెలంగాణలో భారీగా లోటు వర్షపాతం నమోదైంది. ఎల్‌నీవో ప్రభావంతో రాబోయే రోజల్లో కూడా వానలు పెద్దగా పడే అవకాశం లేదని వాతావరణశాఖ అంచనాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల 20వ తేదీ వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మందగించడం, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో వర్షాలు ఈ సారి ముఖం చాటేశాయి. వర్షాలకు తోడు ఎండలు కాస్తున్నాయి.

పెరిగిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. అలాగే ఉక్కబోత కూడా మొదలవ్వడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎండాకాలం ముగిసిపోయిందనే కారణంతో కూలర్లు, ఏసీలు పక్కన పెట్టారు. ఇప్పటికే మళ్లీ ఎండ ప్రభావం పెరుగుతుండటంతో వాటిని వినియోగిస్తున్నారు.

ఏపీకి వర్షసూచన

వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. ఇది ఈరోజు ‘స్పష్టమైన అల్పపీడనం’గా బలపడి,వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి-మోస్తరు వర్ష సూచన ఉందని APSDMA పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us