హైదరాబాద్, ఆగస్టు 23: స్కూళ్లలో చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్టింగ్‌పై తెలంగాణ విద్యా శాఖ వెనక్కి తగ్గింది. ఇంటి దగ్గరే విద్యార్థులు లైవ్‌లో చూసుకునేలా సమాచారం ఇవ్వాలని అన్ని స్కూళ్ల ప్రిన్సిపల్‌లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో ఎలాంటి సామూహికంగా లైవ్‌లు లేదా విద్యార్థులను ప్రత్యేకంగా బయటికి తీసుకెళ్లోద్దని ఆదేశించారు. ఎవరైనా ఇంటి దగ్గర చూడకపోతే తర్వాత రోజు స్కూల్లలో యుట్యూబ్ లో చూపించాలని స్కూళ్ల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. తర్వాత రోజు సెమినార్, స్పీచ్, ఎస్సే రైటింగ్ చంద్రయాన్-3 పై నిర్వహించాలని ఆదేశించారు. కాగా చంద్రయాన్-3 ఈ రోజు చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ చారిత్రక ఘట్టాన్ని స్టూడెంట్స్ లైవ్ లో వీక్షించేందుకు విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ డీఈవోలు, ప్రిన్సిపల్స్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇచ్చారు. ఈ నిర్ణయంపై మార్పులు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని విద్యాసంస్థల యాజమన్యాలు కింద ఇచ్చిన సూచనలను పాటించవలసిందిగా సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. అవేంటంటే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.