Hyderabad: హైదరాబాద్‌లో చలాన్లపై డిస్కౌంట్.? ట్రాఫిక్ పోలీస్ చెప్పిందిదే

డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ఎలాంటి లోక్ అదాలత్‌ను నిర్వహించడం లేదని పోలీసులు పూర్తీ క్లారిటీ ఇచ్చారు. అలాంటి అధికారిక నోటిఫికేషన్ కూడా ఏది జారీ కాలేదని అన్నారు. కావున ప్రజలు ఇలాంటి ఫేక్ న్యూస్‌లు చూసి మోసపోవద్దు అని.. ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీలు లేవని తేల్చి చెప్పారు.

Hyderabad: హైదరాబాద్‌లో చలాన్లపై డిస్కౌంట్.? ట్రాఫిక్ పోలీస్ చెప్పిందిదే

Updated on: Dec 04, 2025 | 2:00 PM

మీ వాహనంపై ఎన్ని ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి.? ఎక్కువ చలాన్లు ఉన్నాయని డిస్కౌంట్ వచ్చాక కడదామని చూస్తున్నారా.? ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రాఫిక్ చలాన్లపై భారీగా రాయితీలు ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. అవి చూశారా.? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ చలాన్లపై భారీగా రాయితీలు ఇస్తున్నారంటూ ఇంటర్నెట్‌లో వచ్చిన వార్తలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. అదంతా పూర్తీగా అవాస్తవం అని తేల్చి చెప్పారు. ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని పోలీసులు సూచించారు.

ముఖ్యంగా డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లపై 100 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై పోలీసులు స్పష్టతనిచ్చారు. తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ఎలాంటి లోక్ అదాలత్‌ను నిర్వహించడం లేదని పోలీసులు పూర్తీ క్లారిటీ ఇచ్చారు. అలాంటి అధికారిక నోటిఫికేషన్ కూడా ఏది జారీ కాలేదని అన్నారు. కావున ప్రజలు ఇలాంటి ఫేక్ న్యూస్‌లు చూసి మోసపోవద్దు అని.. ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీలు లేవని తేల్చి చెప్పారు. ప్రస్తుతం దీనిపై అధికారిక ప్రకటన ఏది లేదని.. తప్పుడు సమాచారాన్ని ఫార్వార్డ్ చేయకుండా.. బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అటు ఇటీవల ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు ప్రకటించడం సరికాదని.. అలా చేస్తే వాహనదారుల్లో ఎలాంటి భయం ఉండదని.. నిబంధనల ఉల్లంఘన ఇంకా ఎక్కువ జరుగుతుందని హైకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.