TRS: ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు వీరాభిమాని బిగ్ విషెస్.. ఏం చేశాడో చూశారా..

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడో అభిమాని. నిజామాబాద్‌కు చెందిన..

TRS: ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు వీరాభిమాని బిగ్ విషెస్.. ఏం చేశాడో చూశారా..
Kavitha

Updated on: Nov 25, 2021 | 9:24 AM

TRS – MLC Kavitha: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడో అభిమాని. నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు సాయి ప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో విషెస్‌ తెలిపారు. 40 అడుగుల కవిత ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఆకాశంలో ఎగరవేశారు. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

ఇదిలావుంటే.. ఇప్పుడు TRS వర్గాల్లో మరో చర్చ జోరుగా సాగుతోంది. కవితకు మంత్రి పదవి పక్కా అంటున్నారు. MLCగా ఎలాగూ 6 సంవత్సరాలు పదవిలో ఉంటారు. ఇప్పుడు కేబినెట్‌లోకి తీసుకుంటే మళ్ళీ TRS సర్కారే వస్తే కంటిన్యూ చేయచ్చనే ఆలోచనలో గులాబీ పెద్దలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కేబినెట్‌లో ఎలాగూ ఒక స్థానం ఖాళీగా ఉంది. దానికి తోడు ఎన్నికలకు ముందే KCR మంత్రి మండలిని ప్రక్షాళన చేస్తారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తే కవితకు మినిస్టర్‌ పోస్ట్ పక్కా అంటున్నారు.

ఇవి కూడా చదవండి: Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. సుందరీకరణలో భాగంగా ఈ నిర్ణయం..

Chanakya Niti: జీవితంలో మార్పును కోరుకుంటున్నారా.. చాణక్యుడు చెప్పిన అద్భుత సూత్రాలు ఇవే..