
నిజామాబాద్‌లో ఓ వ్యక్తి పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. శివాజీనగర్‌కు చెందిన నర్సింగ్ రెడ్డి.. ఇద్దరు ఎస్ఐలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని గమనించి, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సింగ్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తన ఆత్మహత్యాయత్నానికి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో గతంలో పనిచేసిన మాజీ ఎస్ఐ ముజాయిద్, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఎస్ఐ యాదగిరి కారణమంటూ నర్సింగ్ వీడియోలో ఆరోపించారు. ప్రతి చిన్న విషయానికి, ప్రతి కేసులో తనను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల తీరుతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు నర్సింగ్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే, కుటుంబ వివాదానికి సంబంధించి తన తమ్ముడు యాదిరెడ్డి ఇబ్బంది పెడుతున్నాడంటూ నర్సింగ్ గతంలో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే తన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోకుండా, తనపైనే కేసు నమోదు చేశారని నర్సింగ్ ఆరోపిస్తున్నాడు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.
నర్సింగ్ రెడ్డి సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించాల్సి ఉంది. నర్సింగ్ చేసిన ఆరోపణలు నిజమా? కుటుంబ వివాదంలో అసలు ఏం జరిగింది? అతడిపై కేసు ఎందుకు నమోదైంది? అనే అంశాలపై విచారణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..