ఎక్కడ చూసిన ఎండిన ఆకులే.. ఇంతకు వేప చెట్లకు ఏం జరుగుతుంది.. ఇది దానికి సంకేతమేనా?

వేప చెట్లకు ఏమైంది.. పుష్కలమైన ఆక్సిజన్ ఇచ్చే ఆ చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి. ఆ వైరస్ కీడు సంకేతమేనా. ఈసారి ఉగాది పచ్చడికి వేపపువ్వు బంగారమేనా. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగి.. దైవ స్వరూపాలుగా భావించే వేపచెట్లకు ఏమైంది. చెట్లు ఎందుకలా ఎండిపోతున్నాయి. వృక్ష శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు. వేప పువ్వుకు ప్రత్యామ్నాయంగా ఉగాది పచ్చడిలో ఏం ఉపయోగించాలి. వేపచెట్లను వెంటాడుతున్న వైరస్ భయం.

ఎక్కడ చూసిన ఎండిన ఆకులే.. ఇంతకు వేప చెట్లకు ఏం జరుగుతుంది.. ఇది దానికి సంకేతమేనా?
Ugadi Pachadi Alternatives

Updated on: Mar 17, 2026 | 2:32 PM

భారతీయ సంప్రదాయం, ఆయుర్వేదంలో పేర్కొన్న ప్రాథమిక రుచులు ఆరు. వాటిని సుఖదుఃఖాలకు ప్రతీకలుగా భావిస్తారు. షడ్రుచులతోనే ఉగాది పచ్చడి తయారుచేసి తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఆ మిశ్రమాన్ని స్వీకరించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరుతో ఉగాది పచ్చడి తయారుచేస్తారు. వీటిలో తీపిని సంతోషానికి ప్రతీకగా, పులుపు అంటే చింతపండు విరక్తికి ప్రతీకగా, ఉప్పును రుచి – ఆసక్తికి ప్రతీకగా బావిస్తారు. కారం అంటే మిరియాలను కోపం- ఉత్తేజంకు ప్రతీకగా బావిస్తారు. చేదు అంటే వేపపువ్వును బాధ- కష్టం కు ప్రతిరూపంగా బావిస్తారు. వగరు అంటే మామిడి పిందెను ఆశ్చర్యం కొత్తదనానికి ప్రతీకగా బావిస్తారు.

తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ షడ్రుచుల మిశ్రమాన్ని స్వీకరిస్తే ఆ ఆరు రుచుల లాగే మనజీవితం ఉంటుందనేది ప్రతి ఒక్కరి నమ్మకం. కానీ ప్రస్తుతం ఆరు రుచులలో ఈసారి చేదు దూరమవుతుంది. వేప చెట్లను వింత వైరస్ వెంటాడుతుంది. గత ఐదేళ్లుగా వేపచెట్లకు సోకుతున్న వైరస్ ఈసారి మరింత ఎక్కువ ప్రభావం చూపింది. ప్రస్తుతం వేప చెట్లు మొత్తం ఎండిపోయి ఏదో కీడు సంకేతంగా జనంలో ఆందోళన కనిపిస్తోంది.

తెలుగు క్యాలండర్ ప్రకారం 19వ తేదీన ఉగాది పర్వదినం. కానీ ప్రస్తుతం వేపచెట్టుకు ఒక్క వేప పువ్వు కూడా కనిపించడం లేదు. ఆకులు, కొమ్మలతో సహా మొత్తం ఎండి పోయాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉగాది పండుగకు ఈసారి వేప పువ్వు ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేపపువ్వుకు ప్రత్యామ్నాయంగా ఏం వాడాలో తెలియకప వేద పండితుల వద్దకు జనం పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వేపపువ్వుకు బదులు తులసి ఆకులు వాడాలని పండితులు సూచిస్తున్నారు

ఉగాది చరిత్రలో ఎప్పుడులేని విధంగా ఈసారి ఈ సమస్య ఎదురుకావడతో ఇది కీడు సంకేతమా అని గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.వేపచెట్లకు సోనిన ఈ వైరస్‌తో మనసులు ప్రాణాలకు ఏదైనా ముప్పుందా అనే ప్రశ్నలు ప్రజలను బెంబేలెత్తిపోయేలా చేస్తున్నాయి. మొత్తానికి షడ్రుచులలో చేదుకు దూరమైన ఈ ఉగాది ఒక చేదు జ్ఞాపకానంగానే మిగిలి పోతుందా అనే భయం అందిరిలో మిగిలిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us