
నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. కడుపు నొప్పితో వచ్చిన బాలికకు గర్భిణీగా ఉందని, తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కలకలం రేపింది. ఈ రిపోర్ట్ చూసి షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే మరో నర్సింగ్ హోమ్‌లో పరీక్షలు చేయించగా బాలికకు గర్భం లేదని. చిన్న ఆరోగ్య సమస్య మాత్రమే, ఉందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి వైద్యుడిని నిలదీసి దాడికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేటకు చెందిన ఓ కుటుంబం తన కుమార్తెకు కడుపునొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట స్కానింగ్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ స్కానింగ్ తీసుకోడా బాలిక గర్భం దాల్చినట్టు నిర్వాహకులు రిపోర్ట్ ఇచ్చారు. అది విన్న తల్లిదండ్రులు మొదట షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత అనుమానం వచ్చిన పట్టణంలో ఉన్న మరో స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి స్కానింగ్ తీసుకున్నారు. అక్కడి రిపోర్ట్‌లో బాలిక అసలు గర్భమే దాల్చలేదని.. మొదట వచ్చినవి తప్పుడు రిపోర్టులని తెలిపారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు సదురు స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి నిర్వాహకులపై దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై స్థానికులు సైతం తీవ్రంగా స్పందించారు. ఇలాంటి తప్పుడు రిపోర్టులు ఇవ్వడం కుటుంబాలను మానసికంగా కుదేలు చేస్తందని మండిపడ్డారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిచే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో స్కానింగ్ సెంటర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.