AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నాగుపాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో

పాము పేరు వింటనే కొందరు భయపడిపోతారు. ఇక అది ఎదురైతే ఇంకేమైనా ఉందా.. ఆ చుట్టుపక్కల కూడా కనిపించకుండా పారిపోతారు. అలాంటింది ఇక్కడో వ్యక్తి మాత్రం ఊపిరాడక స్పృహ కోల్పోయిన నాగుపాముకు సీపీఆర్ చేసిమరి బ్రతికించాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Watch Video: నాగుపాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో
Mahabubnagar Snake Catcher Revives Unconscious Cobra
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Mar 25, 2026 | 4:50 PM

Share

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల సుదర్శన్ తన వ్యవసాయ పొలం వద్ద వేరుశెనగ పంట వేసుకున్నాడు. ఈ క్రమంలో పంటకు నీళ్లు పెట్టేందుకు పైపులు వేసుకొని వాటికి స్పింక్లర్లు అమర్చుకున్నాడు. ప్రతిరోజూ మాదిరిగానే మూడు రోజుల క్రితం పంట వద్దకు వెళ్లాడు. మోటార్ ఆన్ చేసి నీరు పెడదాం అనుకునే సమయానికి ఓ పైప్ లైన్ నుంచ్ బుస్, బుస్ మంటూ శబ్ధం వినిపించింది. దగ్గరికి వెళ్లి అనుమానంగా చూడగా ఆ పైప్ లో నాగుపాము కనిపించింది.

అయితే ఆ నాగుపామును చంపకుండా మానవతా హృదయంతో దాన్ని అందులో నుంచి ప్రాణాలతో బయటకు తీసి వదిలేయాలని భావించాడు సుదర్శన్. కానీ అసలే నాగుపాము.. ఆపై బుసలు కొడుతోంది. పైపులో ఉన్న నాగుపాము కాటేస్తే ప్రమాదమని భావించి వనపర్తి జిల్లాలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న సాగర్ స్నేక్ సోసైటీ వ్యవస్థాపకుడు కృష్ణ సాగర్‌కు సమాచారం అందించారు. అయితే ఆయన వచ్చేలోపు పైప్‌లో ఊపిరి ఆడకపోవడంతో ఈ పాము స్పృహ కోల్పోయి అందులోనే చిక్కుకుంది.

ఇక స్నేక్ క్యాచర్ వచ్చాక పైపులో నుంచి నాగుపామును బయటకు తీశారు. పాము నిజంగానే చనిపోయిందని అనుకున్నారు. కృష్ణ సాగర్ మాత్రం సీపీఆర్ చేస్తే బ్రతికే అవకాశముందని ప్రయత్నించాడు. నెమ్మదిగా నాగుపాముకు సీపీఆర్ చేసి.. కొన్ని నీళ్లు పోశాడు. కాసేపటికే నాగుపాము స్పృహలోకి వచ్చింది. చనిపోయిందనుకున్న సరీసృపం బ్రతకడంతో అందరి కళ్లలో ఆనందం వెళ్లివిరిసింది. అక్కడి నుంచి పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు కృష్ణ సాగర్. ఈ తతంగాన్నం వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ వీడియో స్థానిక వాట్సప్ గ్రూప్ ల్లో తెగ వైరల్ అవుతోంది.

పాములు ప్రమాదకరం అని వాటిని వెంటాడి వెటాడి చంపే ఈ రోజుల్లో చనిపోయిందనుకున్న పామును సీపీఆర్ చేసి కాపాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భూమి మీద ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని అకారణంగా ఏ ప్రాణిని చంపవద్దని అక్కడ ఉన్నవారికి చెప్పి వెళ్లిపోయారు కృష్ణ సాగర్.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గురు గ్రహ సంచారంతో వారిని ఆపడం ఎవరివల్లా కాదు..
గురు గ్రహ సంచారంతో వారిని ఆపడం ఎవరివల్లా కాదు..
పాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో
పాముకు సీపీఆర్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీడియో
ఏనుగుకు ఎన్ని దంతాలు ఉంటాయి..? 99శాతం మంది అనుకునేది తప్పే..
ఏనుగుకు ఎన్ని దంతాలు ఉంటాయి..? 99శాతం మంది అనుకునేది తప్పే..
Astrology: బంగారం దొరికిందా? ఇది లక్ష్మీ కటాక్షమా లేక దురదృష్ట సూ
Astrology: బంగారం దొరికిందా? ఇది లక్ష్మీ కటాక్షమా లేక దురదృష్ట సూ
జీతం లేని పనిమనుషుల్లారా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే లైఫ్ ఖతమే!
జీతం లేని పనిమనుషుల్లారా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే లైఫ్ ఖతమే!
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం..తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం
శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం..తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?