Nirmal Modi Meeting: ‘తెలంగాణలో బీసీలకు న్యాయం జరగడం లేదు’.. నిర్మల్ సభలో నరేంద్ర మోదీ

తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోదీ నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. 'నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు అంటూ మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ గడ్డపై పుట్టిన కొమరం భీం, రాంజీ గోండు వంటి ఆదివాసీ యోధులకు నా నివాళులు' అంటూ తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకర్షించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. బీజేపీతోనే తెలంగాణ ప్రజల ఆంక్షలు నెరవేరుతాయన్నారు.

Updated on: Nov 26, 2023 | 5:49 PM

తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోదీ నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు అంటూ మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ గడ్డపై పుట్టిన కొమరం భీం, రాంజీ గోండు వంటి ఆదివాసీ యోధులకు నా నివాళులు’ అంటూ తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకర్షించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు. బీజేపీతోనే తెలంగాణ ప్రజల ఆంక్షలు నెరవేరుతాయన్నారు. కాంగ్రెస్ సుల్తాన్ పాలన అయితే.. బీఆర్ఎస్ నిజాం పాలన అని విమర్శించారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ సర్కార్ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మాటను తెలుగులో పలికి కొత్త తరహా ప్రచారానికి తెర లేపారు మోదీ. కేంద్ర పథకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రేకులు వేసిందన్నారు. తెలంగాణలో పేదలకు ఇళ్లు.. మోదీ గ్యారెంటీ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో మరింత అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. వీరిపై విచారణ జరుగుతోందని తెలిపారు. కేసీఆర్‌కి తన కుటుంబం తప్ప ప్రజల బాగోగులు పట్టవని విమర్శించారు. కారు స్టీరింగ్ ఎంఐఎంకు ఇచ్చి కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉన్నారు అని మండిపడ్డారు. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రజలను అడిగారు. తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందని.. పదేళ్లుగా రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. ఆర్మూర్ పసుపుకు జీఐ ట్యాగ్ ఇవ్వాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించిందని వెల్లడించారు.

బీసీల్లో ప్రతిభావంతులకు న్యాయం జరగడం లేదన్నారు. నిర్మల్ బొమ్మలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటూ కళలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ధరణి పేరుతో తెలంగాణలో భూ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి.. మీ భూమి పోర్టల్‌ను తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని విమర్శించారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొందన్నారు. మతం పేరుతో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామనడం దారుణమన్నారు ప్రధాని మోదీ. పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నాం. ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటూ పొడిగించామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకదానికొకటి జిరాక్స్ కాపీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కి ఓటేస్తే అది నేరుగా బీఆర్ఎస్‌కి వెళ్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్ఎస్ పక్కన పెట్టిందన్నారు. ఎస్సీ, ఓబీసీలకు కాంగ్రెస్ తీరని లోటు చేసిందని విమర్శించారు. సామాజిక న్యాయం బీజేపీతో మాత్రమే సాధ్యం అని తెలిపారు. దీనికి నిదర్శనంగా తొలిసారి తెలంగాణలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..