ప్రధాని మోదీతో బండి సంజయ్ భేటీ.. కరీంనగర్ మున్సిపల్ విజయంపై ప్రశంసలు!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిణామాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, అభివృద్ధి నినాదంతోనే తాము ప్రజల్లోకి వెళ్లామని, ప్రజలు బీజేపీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని బండి సంజయ్ ప్రధానికి వివరించారు.

ప్రధాని మోదీతో బండి సంజయ్ భేటీ.. కరీంనగర్ మున్సిపల్ విజయంపై ప్రశంసలు!
Bandi Sanjay Meets Pm Naren

Edited By:

Updated on: Apr 02, 2026 | 10:12 PM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిణామాలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, అభివృద్ధి నినాదంతోనే తాము ప్రజల్లోకి వెళ్లామని, ప్రజలు బీజేపీ నాయకత్వంపై నమ్మకం ఉంచారని బండి సంజయ్ ప్రధానికి వివరించారు. ఈ విజయం తెలంగాణలో పార్టీ బలోపేతానికి నిదర్శనమని ప్రధాని కొనియాడారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులందరికీ ‘మోదీ గిఫ్ట్’ పేరుతో ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లు అందించిన విషయాన్ని బండి సంజయ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ప్రధాని అభినందించారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు మరియు ప్రజా ప్రతినిధుల తరపున బండి సంజయ్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని మోదీ కీలక సూచనలు:

ఇవి కూడా చదవండి

భేటీ సందర్భంగా ప్రధాని మోదీ బండి సంజయ్‌కు పలు మార్గదర్శకాలను అందించారు. ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన తృప్తి ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు, చివరి వ్యక్తికి అందేలా నిర్విరామంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

ప్రధానితో భేటీ అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధానిని కలిసిన ప్రతిసారీ నాకు రెట్టింపు శక్తి, బాధ్యతా భావం కలుగుతాయి. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే నా సంకల్పాన్ని మోదీ గారి మాటలు మరింత బలోపేతం చేశాయి. తెలంగాణ అభివృద్ధి కోసం, బీజేపీ లక్ష్యాలను ప్రతి ఇంటికీ చేరవేయడం కోసం మరింత కఠోరంగా శ్రమిస్తాను అని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us