పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాలుగేళ్ల పాటు విచారణ కొనసాగింది. ఈ కేసులో ఇటీవలే ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది నాంపల్లి కోర్టు. హనీట్రాప్‌తో జయరాం హత్యకు రాకేష్ కుట్ర పన్నారని పక్కా ఆధారాలతో జూబ్లీహిల్స్ పోలీసులు 23 పేజీల చార్జ్‌షీట్ వేశారు. 12 మందిని నిందితులుగా తేల్చారు. కేసులో 73 మంది సాక్షులను విచారించిన కోర్టు… రాకేష్‌రెడ్డిని దోషిగా నిర్దారించింది. మరో 11 మందిని నిర్దోషులుగా తేల్చింది. చిగురుపాటి జయం రాంతి 2019 జనవరి 31న కృష్ణా జిల్లా నందిగామ దగ్గర కారులో శవమై కనిపించారు.
ఈ కేసును దర్యాప్తు చేసిన ఏపీ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని రాకేష్ రెడ్డి రెంట్ ఇంట్లో హత్య జరిగినట్లు తేల్చారు. కేసును తెలంగాణకు బదిలీ చేశారు. ఈ కేసు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కూడా రాకేష్‌రెడ్డి బెదిరించారు.
చివరకు ఈ కేసుపై దాదాపు నాలుగేళ్ల పాటు విచారణ జరిగింది. చివరకు రాకేష్‌రెడ్డికి జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. సామాన్య కుటుంబంలో పుట్టిన రాకేష్ రెడ్డి రాజకీయంగా ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని వివాదాల్లో వేలు పెట్టాడు.
సెటిల్‌మెంట్లు చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆ తర్వాత జయరాం హత్య కేసులో దోషిగా తేలాడు. అయితే తనకు శిక్ష తగ్గించాలని ..తన తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని రాకేష్ కోర్టులో కంటతడిపెట్టుకున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం