Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో – కంటైనర్‌ ఢీకొని 9 మంది మృతి.. మరో 10 మంది పరిస్థితి విషమం

Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీఏపల్లి మండలం అంగడిపేటలో ఆటో - కంటైనర్‌ ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర ...

Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో - కంటైనర్‌ ఢీకొని 9 మంది మృతి.. మరో 10 మంది పరిస్థితి విషమం

Edited By:

Updated on: Jan 21, 2021 | 7:17 PM

Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేటలో ఆటో – కంటైనర్‌ ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక  మృతి చెందిన వారు చింతబావికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

అలాగే ఈ రోజు గుంటూరులో జిల్లా వినుకొండ మండలం చీకటిగలపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం 20 మంది ప్రయాణికులకు గాయాలైన విషయం తెలిసిందే. టీఎస్ఆర్టీసీ బస్సు, లారీ ఢీనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇలా ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. జరుగుతూనే ఉన్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రయాణాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ రహదారులు రక్తసిక్తంగా మారుతున్నాయి.

Also Read: Pocso Court: 23 రోజుల్లోనే సంచలన తీర్పు వెలువరించిన ఘజియాబాద్‌ పోక్సో కోర్టు.. నిందితుడికి మరణ శిక్ష

Loading...
Unable to load recommendations.
Follow Us