Nalgonda: ‘పైసా లేదంటే పని జరగదు..’ అవినీతి అధికారిణికి చెక్ పెట్టిన ఏసీబీ

అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా.. అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తమ వంకర బుద్ధిని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా నల్లగొండ లో ఏసీబీ వలకు ఓ అవినీతి అధికారిణి చిక్కారు. ఓ సొసైటీలో కొత్త సభ్యుల చేరికకు అనుమతి కోసం 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Nalgonda: పైసా లేదంటే పని జరగదు.. అవినీతి అధికారిణికి చెక్ పెట్టిన ఏసీబీ
Charitha Reddy

Edited By:

Updated on: Sep 04, 2025 | 5:50 PM

నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఉంది. మత్స్యశాఖ జిల్లా అధికారిణిగా చరితారెడ్డి కొనసాగుతున్నారు. జిల్లాలోని ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీలో నూతన సభ్యుల కోసం ఆయా సొసైటీలు జిల్లా మత్స్య శాఖ అధికారిణికి దరఖాస్తు చేసుకున్నాయి. సొసైటీలో కొత్త సభ్యుల చేరికకు సంబంధించి అనుమతి ఇచ్చేందుకు జిల్లా మత్స్య శాఖ అధికారిణి చరితారెడ్డి 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో సదరు సొసైటీ సభ్యులు ఏసీబీని ఆశ్రయించారు.

జిల్లా కలెక్టరేట్‌లోని మత్స్యశాఖ కార్యాలయంలో 20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా జిల్లా అధికారిణి చరిత రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్ శాఖ అధికారి చరిత రెడ్డిని హైదరాబాద్ నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచాలు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు.

కాగా ఇటీవలి కాలంలో.. ఏసీబీ మెరుపు దాడులతో దూసుకెళ్తుంది. లంచగొండి అధికారులు గుండెల్లో దడ పుట్టిస్తుంది. లంచం తీసుకుంటే ఎంతటివారినైనా ఉపేక్షించమని హెచ్చరికలు పంపుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us