చెప్పు.. ఎంత పనిచేసింది.. డ్రైవరన్నలూ జర భద్రం.. ఆ ఒక్క పొరపాటుతో రెండు ప్రాణాలు..

కారు డ్రైవ్ చేస్తున్నారా.. స్టీరింగ్ తిప్పడం, గేర్లు మార్చడం, రయ్యిన యాక్సిలేటర్‌ని రైజ్ చేయడం.. ఇవి మాత్రం తెలిస్తే చాలదు. వేల కిలోమీటర్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే సరిపోదు. ఇక్కడ మనకు తెలీని, మనం అస్సలు పట్టించుకోని కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలుంటాయ్. వాటిని పాటించకపోతే మన ప్రాణాలు ఎంతమాత్రం సేఫ్ కాదు. దీనికి ఒక డెడ్లీ ఎగ్జాంపులే నల్గొండ జిల్లాలో జరిగిన కారు ప్రమాదం.

చెప్పు.. ఎంత పనిచేసింది.. డ్రైవరన్నలూ జర భద్రం.. ఆ ఒక్క పొరపాటుతో రెండు ప్రాణాలు..
Cheppal

Updated on: Feb 08, 2026 | 7:41 PM

కారు డ్రైవ్ చేస్తున్నారా.. స్టీరింగ్ తిప్పడం, గేర్లు మార్చడం, రయ్యిన యాక్సిలేటర్‌ని రైజ్ చేయడం.. ఇవి మాత్రం తెలిస్తే చాలదు. వేల కిలోమీటర్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే సరిపోదు. ఇక్కడ మనకు తెలీని, మనం అస్సలు పట్టించుకోని కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలుంటాయ్. వాటిని పాటించకపోతే మన ప్రాణాలు ఎంతమాత్రం సేఫ్ కాదు. దీనికి ఒక డెడ్లీ ఎగ్జాంపులే నల్గొండ జిల్లాలో జరిగిన కారు ప్రమాదం.

నిన్న రాత్రి నిడమనూరు మండలం ముకుందాపురం దగ్గర ఓ కారు అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు గల్లంతయ్యారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. SDRF, గజ ఈతగాళ్లతో నిన్న రాత్రి నుంచి గాలిస్తే, కంపసాగర్‌కు చెందిన పద్మ అనే మహిళ మృతదేహం దొరికింది. ఆమె భర్త పుల్లయ్య ఆచూకీ తెలీలేదు.

చిన్న పొరపాటు చాలు, క్షణం ఏమరుపాటు చాలు అదే గ్రహపాటౌతుంది. జీవితాలకు జీవితాల్నే కబళించేస్తుంది. మరో 2 కిలోమీటర్లు వెళ్తే ఇంటికి చేరుకోవాల్సిన ఆ విధివంచితులు, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మృత్యువును వెతుక్కుంటూ వెళ్లారు.

మద్యం సేవించి డ్రైవ్ చేశాడా లేదా అనేది దర్యాప్తులో తేలుతుంది. కానీ, తెలిసో తెలీక డ్రైవర్ మరో నిర్లక్ష్యానికి పాల్పడ్డాడు. దాని ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఏమిటది?

డ్రైవర్ చెప్పులు విడిచి కారు నడపడమే ప్రమాదానికి అసలు కారణంగా తెలుస్తోంది. యాక్సిలేటర్, బ్రేక్‌ దగ్గర‌ చెప్పులు ఇరుక్కోవడంతో వాహనం కంట్రోల్ తప్పిందట.

డ్రైవరన్నలకు రవాణా శాఖ నుంచి స్పష్టమైన డైరెక్షన్స్ ఉన్నాయి.

>>వీలైనంతవరకు డ్రైవర్లు షూ మాత్రమే వాడాలి!

>>చెప్పులతో డ్రైవ్ చేయాల్సివస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పులు వదలకూడదు.

>>డ్రైవర్ సీటు కింద వాటర్ బాటిల్స్ లాంటి వస్తువులు పెట్టకూడదు.

>>ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

సో, కాళ్లకు చెప్పులేసుకుని డ్రైవ్ చేస్తే ప్రాణాలకు గ్యారంటీ లేదన్నమాట. డ్రైవింగ్ నైపుణ్య పుస్తకాల్లో కొత్తగా చేర్చాల్సిన చాప్టర్ ఇది. వేసుకున్న చెప్పులు విడిచి కార్ డ్రైవ్ చేస్తే ఎక్సలేటర్‌కు చుట్టుకునే ప్రమాదముంది. చెప్పులు వేసుకుని డ్రైవ్ చేసే అలవాటున్న దోస్తులందరూ జర భద్రం మరి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..