Suryapet: వినాయకుడిపై ముస్లిం యువకుడి భక్తి.. ఇంటింటికి గణపతి వ్రతకల్పం పంపిణీ.. అభిమాన నేత అభివృద్ధిని వివరిస్తూ..

| Edited By: శివలీల గోపి తుల్వా

Sep 18, 2023 | 2:23 PM

Suryapet: కుటుంబ సభ్యులు పట్టణ వాసులకు పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి గణపతి విగ్రహాలతో పాటు ముస్లిం యువకుడు మాజిద్ ప్రచురించిన వినాయక వ్రత కల్ప పుస్తకాన్ని అందజేశారు. ఈ పుస్తకం ఈ వినాయక చవితికి సూర్యాపేటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం గంగా జమునా తాహజీబ్ కు తార్కణం మాదిరిగానే ఈ పుస్తక పంపిణీతో సూర్యాపేటలో..

Suryapet: వినాయకుడిపై ముస్లిం యువకుడి భక్తి.. ఇంటింటికి గణపతి వ్రతకల్పం పంపిణీ.. అభిమాన నేత అభివృద్ధిని వివరిస్తూ..
SK Majid
Follow us on

సూర్యపేట, సెప్టెంబర్ 18: అసలే వినాయక చవితి, ఆపై ముస్లిం కుటుంబానికి చెందిన యువకుడు ప్రచురించిన పుస్తకాలు ఇంటింటా దర్శనమిస్తున్నాయి. హిందువులు సంప్రదాయంగా జరుపుకునే పండుగ విధానాన్ని పుస్తకం రూపంలో ఓ ముస్లిం యువకుడు అందించాడు. ఆ ముస్లిం యువకుడు ప్రచురించిన పుస్తకం ఏంటి..? అసలు ఆ పుస్తకం ఏ పండుగ గురించి..? ఆ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే..

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జురుకు చెందిన ఎస్కే మాజిద్ 2001లో టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మంత్రి జగదీష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నాడు. ఉద్యమ సమయంలో జగదీష్ రెడ్డి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ఆయనే కాదు వాళ్ళ కుటుంబం కూడా పాల్గొనేది. మాజిద్.. తన అభిమాన నేత మంత్రి జగదీష్ రెడ్డి కోసం వినూత్నమైన పద్ధతిలో తనకు చేతనైన తోడ్పాటు అందించాలనుకున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రం రూపురేఖలను మార్చి అభివృద్ధిని పరుగులు పెట్టించాడు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి చేర్చాలని మాజిద్ భావించాడు.

అంతే, ఇందుకోసం హిందువులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వినాయక చవితిని ఎంచుకున్నాడు. సూర్యాపేట పట్టణ అభివృద్ధి పథకాలతో కూడిన వినాయక చవితి వ్రత కల్ప పుస్తకాన్ని రూపొందించాడు మాజీద్. ఈ పుస్తకాన్ని చూసిన మంత్రి జగదీష్ రెడ్డి, సునీతా జగదీష్ రెడ్డి దంపతులు మంత్ర ముగ్దులయ్యారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా మంత్రి జగదీశ్ రెడ్డి కుటుంబ సభ్యులు పట్టణ వాసులకు పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి గణపతి విగ్రహాలతో పాటు ముస్లిం యువకుడు మజీద్ ప్రచురించిన వినాయక వ్రత కల్ప పుస్తకాన్ని అందజేశారు. ఈ పుస్తకం ఈ వినాయక చవితికి సూర్యాపేటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం గంగా జమునా తాహజీబ్ కు తార్కణం మాదిరిగానే ఈ పుస్తక పంపిణీతో సూర్యాపేటలో మత సామరస్యం వెల్లి విరిసిందని చెప్పుకోవచ్చు. వినాయక చవితి సందర్భంగా వినాయక వ్రత కల్ప పుస్తకాన్ని ప్రచురించి పంపిణీ చేయడం పట్ల మజీద్‌ను పట్టణవాసులు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..