Nirmal: కంపు కొడుతున్న నగరం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

| Edited By: Velpula Bharath Rao

Oct 06, 2024 | 7:02 PM

నిర్మల్ జిల్లా మున్సిపాలటీ మురికి కంపుతో ముక్కులు పగిలేలా ఉందని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ జిల్లా కేంద్రంలోని ఏ గల్లి చూసిన చెత్తతోనే దర్శనమిస్తోంది. బయటకు అడుగు పెట్టాలంటే ముక్కులు మూసుకునేలా చెత్త వాసన కంప కొడుతోంది.

Nirmal: కంపు కొడుతున్న నగరం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Municipal Workers Strike In
Follow us on

నిర్మల్ జిల్లా మున్సిపాలటీ మురికి కంపుతో ముక్కులు పగిలేలా ఉందని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ జిల్లా కేంద్రంలోని ఏ గల్లి చూసిన చెత్తతోనే దర్శనమిస్తోంది. బయటకు అడుగు పెట్టాలంటే ముక్కులు మూసుకునేలా చెత్త వాసన కంప కొడుతోంది. కారణం ఏంటంటే అక్కడి మున్సిపల్ అదికారులు ఆరు రోజులుగా సమ్మెకు దిగడమే. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థికంగా కుంగిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగడంతో మున్సిపాలిటీ పరిదిలోని కాలనీల్లో చెత్త సేకరణ జరగక.. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి కాలనీలన్నీ కంపుకొడుతొన్నాయి.

దసరా పండుగ కావడంతో షాపింగ్ కోసం మార్కెట్ కొస్తున్న జిల్లా వాసులకు చెత్త కుప్పలే స్వాగతం పలుకుతున్నాయి. బతుకమ్మ పండుగ జరుపుకుందామంటే కాలనీల్లో పేరుకుపోయిన చెత్తే కళ్ల ముందు దర్శనమిస్తుండటంతో పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులుగా మున్సిపల్ కార్మికులు నిరసనలు , ధర్నా లు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్ర మనోవేదనతో కొనసాగుతున్నారు మున్సిపల్ కార్మికులు.

సమ్మెలో భాగంగా ఆరవ రోజు నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట గాంధీ పార్కులో మున్సిపల్ కార్మికులు శాంతియుత నిరసన చేపట్టారు . గత మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందని.. ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే వేతనాలు చెల్లించాలని, లేనట్లయితే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇది ఇలాగే కొనసాగితే నిర్మల్ పట్టణం దసరా పండుగను చెత్త కుప్పల మద్యే జరుపుకోవాల్సి వస్తుందేమోనని స్థానిక జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పండుగను దృష్టిలో పెట్టుకుని చెత్తను తొలగించే ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చాలని నిర్మల్ పట్టణ వాసులు కోరుతున్నారు.