TPCC Chief Revanth Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ములుగు ఎమ్మెల్యే సీతక్క కలిశారు. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. గజమాలతో రేవంత్ రెడ్డి సన్మానించారు. రేవంత్ ని సన్మానించేందుకు ఎమ్మెల్యే సీతక్క పెద్ద సంఖ్యలో తన అనుచరులతో తరలి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కార్యకర్తల అభీష్టం మేరకే అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ గా నియమించిందన్నారు. సీల్డ్ కవర్ అని విమర్శిస్తున్న వారివి ఒట్టి మాటలే అని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదని సీతక్క పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. కార్యకర్తలు, ప్రజలు, భగవంతుని ఆశీస్సులే రేవంత్ రెడ్డిని పీసీసీ వరించేట్లుగా చేశాయన్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకంతో పార్టీ క్యాడర్ లో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. వేల సంఖ్యలో అభిమానులను చూస్తుంటే నిజంగా పండగ వాతావరణంలా అనిపిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పటిష్టం కాబోతుందన్నారు.
రేవంత్ రెడ్డి ఎదుగుదలను ఓర్చుకోలేకే కొందరు సీల్డ్ కవర్ అని మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. క్షేత్ర స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డికి భారీ ప్రణాళికే ఉందని ఆమె చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతారని, పార్టీని సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడమే రేవంత్ రెడ్డి ముందున్న లక్ష్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని సీతక్క విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా, రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చే ముందు.. ఎమ్మెల్యే సీతక్క మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున వాహనాలతో ర్యాలీగా వెళ్లిన ఎమ్మెల్యే సీతక్క.. వన దేవతలను దర్శించుకుని రేవంత్ రెడ్డి పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. తన సోదరుడు రేవంత్ రెడ్డి ప్రజల కోరిక మేరకు పీసీసీ చీఫ్‌గా నియామకం అయ్యారని, ఈ సందర్భంగా మేడారంలో తాను మొక్కులు చెల్లించుకున్నానని సీతక్క తెలిపారు.
Revanth Reddy:
Brother @revanth_anumula Garu I am bring you the blessings of the Tribal Gods and the inspiration of Dr BR Ambedkar Garu to congratulate you and wish you all the best. #TPCCRevanthReddy @RahulGandhi @priyankagandhi @manickamtagore @JitendraSAlwar #COVID19 #Congress @srinivasiyc pic.twitter.com/JyoqDBTXds
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) June 29, 2021
Also read:
T20 World Cup: పొట్టి ప్రపంచకప్‌లో ఆడాలని ఉంది.. బోర్డు నిబంధనతోనే ఇబ్బంది: లసిత్ మలింగ