ఇల్లందు సింగరేణిలో మొహర్రం..అదో మానని గాయం

|

Sep 10, 2019 | 2:40 PM

ఇల్లందు సింగరేణిలో మొహర్రం అంటే మానని గాయంగా గుర్తుంపెట్టుకుంటారు అక్కడి కార్మికులు. ప్రభుత్వ, ప్రవేటు సంస్థలన్నింటికీ.. అన్ని పండగల మాదిరిగానే మోహరం సందర్భంగా సెలవులను ప్రకటిస్తాయి. కానీ సింగరేణి వ్యాప్తంగా మొహరం నాడు హాలిడే ప్రకటించడంలో ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాదు సింగరేణి అన్ని ఏరియాల్లో కెల్లా ఇల్లందుది మరో స్పెషల్‌. రాష్ట్రంలోని సింగరేణి అంతట సాధారణ సెలవును ఆదివారంగా కొనసాగిస్తోంది యజమాన్యం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా లో మాత్రం శుక్రవారం సెలవు దినంగా […]

ఇల్లందు సింగరేణిలో మొహర్రం..అదో మానని గాయం
Follow us on

ఇల్లందు సింగరేణిలో మొహర్రం అంటే మానని గాయంగా గుర్తుంపెట్టుకుంటారు అక్కడి కార్మికులు. ప్రభుత్వ, ప్రవేటు సంస్థలన్నింటికీ.. అన్ని పండగల మాదిరిగానే మోహరం సందర్భంగా సెలవులను ప్రకటిస్తాయి. కానీ సింగరేణి వ్యాప్తంగా మొహరం నాడు హాలిడే ప్రకటించడంలో ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాదు సింగరేణి అన్ని ఏరియాల్లో కెల్లా ఇల్లందుది మరో స్పెషల్‌. రాష్ట్రంలోని సింగరేణి అంతట సాధారణ సెలవును ఆదివారంగా కొనసాగిస్తోంది యజమాన్యం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా లో మాత్రం శుక్రవారం సెలవు దినంగా నిర్వహిస్తోంది. అంతేకాదు.. ఇల్లందులో మొహర్రంకు, శుక్రవారం సెలవుకు వెనక ఏళ్లనాటి చరిత్రే ఉందంటున్నారు సింగరేణి యజమాన్యం, సిబ్బంది.
ఇల్లందు ఏరియాలో బ్రిటిష్ భూగర్భ పరిశోధన అధికారి విలియం కింగ్ 1871 లో ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు “ది దక్కన్ కంపెనీ లిమిటెడ్” అనే ప్రైవేట్ కంపెనీ 1886లో త్రవ్వకాలను ప్రారంభించింది. 1889 నాటికి ఉత్పత్తిని ప్రారంభించింది.( బ్రిటిష్ హయాంలో బొగ్గు తవ్వకాలు ప్రైవేట్ కంపెనీ ఆధీనంలో ఉండేది.) అనంతరం బొగ్గును సింగరేణి అనే గ్రామం వద్ద కనిపెట్టడంతో 1920 సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చుతూ పబ్లిక్ లిమిటెడ్ చేశారు.  ఇల్లందులో అండర్ గ్రౌండ్ ద్వారా బొగ్గు ఉత్పత్తిని వెలికి తీస్తున్నారు.

పూసపల్ల సమీపంలో స్టట్ ఇంక్లైన్ భూగర్భ గనిలో 1938 మార్చి 12వ తారీకున ఘోర గని ప్రమాదం జరిగింది. మృత్యు రూపంలో విషవాయువులు గనిని వ్యాపించాయి. జనరల్ మేనేజర్, మేనేజర్ లతోపాటు 35 మంది కార్మికులు, ఆరుగురు మహిళా కార్మికులు మొత్తం 43 మంది విషవాయువు పీల్చుకుని మృతి చెందారు. సింగరేణి కాలరీస్ కంపెనీ చరిత్రలోనే ఇది పెద్ద ప్రమాద సంఘటన. చారిత్రకమైన అంశం. కార్మికులు మృతి చెందిన రోజు శుక్రవారం. అదే రోజు.43 మంది మృతికి జ్ఞాపకార్ధంగా శుక్రవారం అప్పటి బ్రిటీష్ గవర్నమెంట్ ఇల్లందు ఏరియాలో సెలవులు ప్రకటించింది. అదేవిధంగా మొహరం రోజు ప్రమాదం జరిగి నందున ప్రతి సంవత్సరం మొహరం పండుగ కు సింగరేణి వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. కార్మికులు మృతి చెందిన  స్టట్ ఇంక్లైన్ వద్ద సింగరేణి కాలరీస్ కంపెనీ స్థూపాన్ని నిర్మించింది. ఇక్కడి 24 ఏరియాలో మృతుల సమాధులను ఏర్పాటు చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆనవాయితీ నేటి వరకు ఇప్పటి సింగరేణి యాజమాన్యం కొనసాగిస్తుంది. ఇల్లందు తో పాటు అన్ని సింగరేణి ఏరియాలలో  మోహరం రోజు సెలవుగా ప్రకటిస్తారు.. కానీ శుక్రవారం మాత్రం ఇల్లందు ఏరియా కు మాత్రమే సెలవు దినంగా జరుపుకుంటారు.. మిగిలిన అన్ని సింగరేణి ఏరియాలలో ఆదివారం మాత్రమే వారంతపు సెలవుగా ఉంది. ఇక కార్మికుల మృతి చెందిన రోజున ఇల్లందు ఏరియా సింగరేణి అధికారులు సంస్మరణ సభ నిర్వహించి మృతులకు ఘనంగా నివాళులు అర్పిస్తారు.
ఇదిలా ఉండగా  సింగరేణి బొగ్గు పుట్టినిల్లు అయిన ఇల్లందు ఏరియా చరిత్రలో నిలిచిపోయే విధంగా బొగ్గు ఉత్పత్తిని సాధించింది. కోట్ల సంపదను ఈ దేశానికి అందించింది అనేకమంది కార్మికులు తమ ప్రాణాలను అర్పించారు. ఇలాంటి చరిత్ర కలిగిన ఇల్లందు ను తరతరాలుగా గుర్తుండి పోయేలా పర్యాటక కేంద్రంగా మార్చాలని, మ్యూజియంలు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, కార్మికులు కోరుతున్నారు.