Ayushman Bharat: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బండి సంజయ్.. ఆలస్యంగానైనా.. అంటూ ట్విట్

Bandi Sanjay: ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్

Ayushman Bharat: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన బండి సంజయ్.. ఆలస్యంగానైనా.. అంటూ ట్విట్
Bandi Sanjay Kumar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 18, 2021 | 10:30 PM

Bandi Sanjay: ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని తాము వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఒత్తిడి ఫలించిందని బండి సంజయ్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ పథకంలో చేరాలని ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ సంజయ్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ‘‘గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష’’ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్స చేయడంతో పాటు పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బండి సంజయ్ మంగళవారం రాత్రి ట్విట్ చేశారు.

బండి సంజయ్ చేసిన ట్విట్..

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తునర్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంగళవారం ఉదయం నిర్ణయించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎ.ఎం. రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోకు అమలుకు సంబంధించిన ఉత్తర్వులను (ఎంఓయూ) జారీ చేశారు.

Also Read:

Kerosene: కరోనా భయం.. కిరోసిన్ తాగిన యువకుడు.. ఆ తర్వాత ప్రాణాలతో పోరాడి..

Oxygen: నేపాల్‌కు భారత్ చేయూత.. ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అంగీకారం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే