Viral Video : కోతి చేష్ట‌లు అంటే ఇదేనేమో.. కరెంట్‌ పోల్‌ ఎక్కి కష్టాలు తెచ్చుకుంది.. ఆ తర్వాత చూడాలి మరీ

|

Jul 20, 2022 | 3:02 PM

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని VM బంజర్ రింగ్ సెంటర్ సమీపంలో ఓ కోతి హల్‌చల్‌ చేసింది. కరెంటు స్తంభం పైకి ఎక్కిన ఓ కోతిని కాపాడేందుకు ఏకంగా విద్యుత్ శాఖ సిబ్బంది,స్థానికులు పెద్ద యుద్ధమే చేశారు..

Viral Video : కోతి చేష్ట‌లు అంటే ఇదేనేమో.. కరెంట్‌ పోల్‌ ఎక్కి కష్టాలు తెచ్చుకుంది.. ఆ తర్వాత చూడాలి మరీ
Monkey
Follow us on

Viral Video : కోతి అంటేనే చిలిపి చేష్టలకు పెట్టింది పేరు. మ‌న ఇంట్లో ఎవ‌రైనా చిన్న పిల్ల‌లు బాగా అల్ల‌రి చేస్తుంటే.. లేదా ఏదైనా విచిత్ర‌మైన ప‌నులు చేస్తుంటే.. కోతి చేష్ట‌లు అంటూ తిట్టడం చాలా కామ‌న్‌. అయితే నిజానికి కోతి చేష్ట‌లు అంటే అంత విచిత్రంగా ఉంటాయా అంటే చాలా సార్లు కోతులు దీన్ని నిజం చేసి చూపించాయి. కోతుల‌కు వ‌చ్చే ఆలోచ‌న‌లు మ‌రెవ‌రికీ రావేమో. ఒక వ‌స్తువును అయినా లేదంటే ఆహార ప‌దార్థాల‌ను అయినా తిన్న‌గా వాడ‌వు అవి. చిత్ర విచిత్రంగా వాడుతూ వికారం తెప్పిస్తుంటాయి. కోతి చేష్టలు చాలా సార్లు నవ్వు తెప్పించినా.. అప్పుడప్పుడు ప్రాణాల మీదకు కూడా తెస్తాయి. ఇదిగో ఇలాంటి సంఘటనే ఇది..

కొంటే చేష్టలు చేస్తూ…చిక్కుల్లో చిక్కు కుంది ఓ కోతి. తుంటరి పనుల్లో తనకు తానే తోపు అనుకుందేమో గానీ…కరెంట్ స్తంభం పైకి తీగలు పట్టుకుని కోతి చేష్టలు చేస్తూ…విద్యుత్ షాక్‌తో గింగిరాలు తిరిగింది.. దాన్ని గమనించిన స్థానికులు.. విద్యుత్‌ శాఖ సిబ్బందితో కలిసి దాదపు అరగంటపాటు శ్రమించి ఎట్టకేలకు ఆ వానరాన్ని కాపాడారు. ఈఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని VM బంజర్ రింగ్ సెంటర్ సమీపంలో ఓ కోతి హల్‌చల్‌ చేసింది. కరెంటు స్తంభం పైకి ఎక్కిన ఓ కోతి విద్యుత్ షాక్ కు గురై కరెంట్ వైర్ల పైనే అపస్మారక స్థితిలోకి చేరుకుంది. అది గమనించిన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ఇవి కూడా చదవండి

తర్వాత అక్కడికి చేరుకున్న విద్యుత్‌ శాఖ సిబ్బంది కరెంట్ వైర్ల పైనే సృహా తప్పి పడిపోయి ఉన్న కోతిని కిందకు దింపేందుకు ప్రయత్నం చేశారు. వైర్ల పై నుండి కోతి కింద పడినప్పుడు గాయపడకుం జాగ్రత్తపడ్డారు. స్థానికుల సాయంతో కోతిని పట్టుకోవడానికి వల మాదిరిగా సంచులను రక్షణగా పట్టుకున్నారు. కర్రల సాయంతో వైర్లపై స్పృహ తప్పి పడిపోయి ఉన్న కోతి నీ కిందకు పడేలా చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సృహ లోకి వచ్చిన కోతి..చుట్టూ చూసుకుని అక్కడ్నుంచి జంప్‌ అయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి