MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. రేపే విచారణకు రావాలంటూ..

|

Sep 14, 2023 | 1:51 PM

Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంతోపాటు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మొదటనుంచి ఎన్నో మలుపులు తిరుగుతున్న లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్‌కు చెందని వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారడంతో మళ్లీ సెగలు పుట్టిస్తోంది. విచారణను వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ)

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. రేపే విచారణకు రావాలంటూ..
MLC Kavitha
Follow us on

Delhi liquor scam case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశంతోపాటు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. మొదటనుంచి ఎన్నో మలుపులు తిరుగుతున్న లిక్కర్ స్కామ్ కేసు.. హైదరాబాద్‌కు చెందని వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారడంతో మళ్లీ సెగలు పుట్టిస్తోంది. విచారణను వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై బినామిగా ఈడీ అభియోగాలు మోపింది. ఈ మేరకు ఎఫ్ఐర్ కాపీలో కూడా ప్రస్తావించింది. ఇప్పటికే కవితను విచారించిన ఈడీ.. మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే, అరుణ్ పిళ్లై అప్రూవర్ గా మారి వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో కీలక ఆధారాలు సేకరించేందుకు కవితకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై కవిత స్పందించాల్సి ఉంది. విచారణకు హాజరవుతారా.?? లేదా..? అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారి ఈడీకి స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే, ఈ అరుణ్ రామచంద్ర పిళ్లైను కవిత బినామీగా ఈడీ చెబుతోంది. గతంలో కవితను ఢిల్లీలో పలుమార్లు విచారించిన ఈడీ అధికారులు సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే, పిళ్లై ఎలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారనేది కూడా తెలియాల్సి ఉంది.

విపక్షాలను బలహీనం చేయడమే కేంద్రం లక్ష్యం..

అయితే, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై మంత్రి హరీష్‌రావు స్పందించారు. టీవీ9తో మాట్లాడిన హరీష్ రావు కేంద్ర సర్కార్‌ కావాలనే విపక్షాలను టార్గెట్‌ చేస్తోందంటూ మండిపడ్డారు. ఇప్పటివరకూ ఒక్క బీజేపీ నేతపై కూడా కేసు నమోదు చేయలేదంటూ పేర్కొన్నారు. విపక్షాలను బలహీనం చేయడమే కేంద్రం లక్ష్యమని.. అందులో భాగంగానే బీఆర్‌ఎస్‌ నాయకురాలు ఎమ్మెల్సీ కవితను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ హరీష్‌రావు పేర్కొన్నారు. దేశంలో విపక్షాలను టార్గెట్‌ చేసి, బలహీనపపరచాలన్న కేంద్ర దుష్టపన్నాగాలను తిప్పికొట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..