
MLC Kavitha Interview with Rajinikanth: లిక్కర్ స్కామ్ తర్వాత ఒక్కసారిగా తెరపైకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీవీ9కు ఇచ్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెళ్లడించారు. లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకోవడానికే కవిత మహిళా రిజర్వేషన్ అంశం తెరపైకి తెచ్చారా అన్న ప్రన్నకు కవిత బదులిస్తూ..’అసలు స్కామ్ జరిగిందో లేదో అనే విషయమే ఎవరి తెలియదన్నారు. బీజేపీ వాల్ల మొదటి టార్గెట్ కేసీఆర్ గారు. ఆయనను టార్గెట్ చేయడానికి మా కుటుంబలో మొదటగా నన్ను టార్గెట్ చేశారు. ఆ తర్వాత పార్టీలో అందరిని బెదిరించాలని చూస్తున్నారు. ఏజెన్సీలను ఉపయోగించి అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారుని కవిత చెప్పుకొచ్చారు.
ఉన్నపలంగా మహిళా రిజర్వేషన్ ఎందుకు గుర్తొచ్చిందంటూ అడిగిన ప్రశ్నకు కవిత సూటిగా బదులిచ్చారు. తాము 9 ఏళ్లుగా ప్రతీ మహిళా దినోత్సవం సందర్భంగా బిల్లు పెట్టమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మహిళా బిల్లు పాస్ చేస్తే వేలాది మందికి ఉపయోగపడుతుందని.. అందుకే ఈ సమస్యను తాను టేకప్ చేశానని స్పష్టం చేశారు. కనీసం చట్టం చేస్తే మహిళలకు న్యాయం జరుగుతుందని కవిత అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ఎజెండాలో ఎప్పటి నుంచో మహిళా బిల్లు కోసం డిమాండ్ ఉందని.. అందుకే ఈ ఏడాది కూడా మరోసారి ఈ డిమాండ్‌ను తెరమీదికి తీసుకొచ్చామని కవిత అన్నారు.
మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేషన్ పై బిజెపి చేర్చిందని, ఆ హామీని ఇప్పటికైనా అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇంకా కేవలం మూడు పార్లమెంటు సమావేశాలు మాత్రమే ఉన్నాయని, కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
మహిళలు రాజకీయ రంగంలో ముందు ఉండాలంటే రిజర్వేషన్ తోనే సాధ్యమవుతుందని భారత్ జాగృతి విశ్వసిస్తుందని తెలిపారు. మార్చి 8 న హోళీ పండుగ ఉన్నందును మార్చి 10 న ఢిల్లీలో దీక్ష చేస్తున్నామని, మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తి పెంపొందించాలి అన్న లక్ష్యంతో పని చేసి, నేడు దేశవ్యాప్తంగా కూడా అదే పని చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందని గుర్తుచేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జంతర్మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేయాలనే నిర్ణయించామని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం