MLAs Purchasing Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక మలుపు.. విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్..

|

Dec 27, 2022 | 10:10 AM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో విచారణకు హాజరు కాకూడదని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తును సిట్ ను కాదని సీబీఐ అప్పగించడాన్ని ఆయన తప్పుబట్టారు....

MLAs Purchasing Case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక మలుపు.. విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్..
Rohit Reddy
Follow us on

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో విచారణకు హాజరు కాకూడదని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కేసు దర్యాప్తును సిట్ ను కాదని సీబీఐ అప్పగించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీంతో రోహిత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు రోజులు రోహిత్‌ని పశ్నించింది ఈడీ. ఇవాళ మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈడీ విచారణకు హాజరు కావడం లేదంటూ.. అధికారులకు రోహిత్ రెడ్డి మెయిల్ చేశారు. హై కోర్టు లో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో విచారణ కు హాజరు కానని వెల్లడించారు. కాగా.. రేపు (బుధవారం) హై కోర్టు లో రోహిత్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరగనుంది. హై కోర్టు తీర్పు వచ్చాకే తదుపరి విచారణ పై నిర్ణయం తీసుకుంటానని రోహిత్ రెడ్డి తెలిపారు. రోహిత్ రెడ్డి గైర్హాజరు తో ఈడీ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కాగా.. ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ రోహిత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సిట్‌ను కాదని సీబీఐకి కేసు విచారణ అప్పగించడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలనే హైకోర్టు నిర్ణయంపై స్పందించిన ఆయన.. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ, డివిజన్‌ బెంచ్‌కు వెళ్లాలా..? లేక సుప్రీం కోర్టును ఆశ్రయించాలా..? అనేది నిర్ణయించుకుంటామన్నారు.

ఇప్పటికే 2 రోజులపాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించిన ఈడీ.. ఇవాళ మళ్లీ రావాలని ఆదేశించింది. నందకుమార్‌ ఇచ్చే స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది..! ఈ క్రమంలో ఆయన గైర్హాజరు కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం