Telangana: మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధం నీడలు.. భద్రత కట్టుదిట్టం..

IPL వాయిదా. మరి మిస్‌ వరల్డ్‌ మాటేంటి? . ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో హైలెవల్‌ మీటింగ్‌ జరిగింది. యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో సెక్యూరిటీపై సుదీర్ఘంగా సమీక్షించారు.పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశించారు. ఇప్పటికే కంటెస్టెంట్లు బస చేసిన హోటళ్ల దగ్గర మూడెంచల భద్రత కొనసాగుతోంది.

Telangana: మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధం నీడలు.. భద్రత కట్టుదిట్టం..
Miss World 2025

Updated on: May 09, 2025 | 9:30 PM

ఆపరేషన్‌ సింధూర్‌  పాకిస్థాన్‌ వెన్నులో వణుకు రేపుతోంది. పాకిస్థాన్‌ కుట్రలను ప్రపంచదేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి.  పాకిస్థాన్‌ పర్యటనలో తమ దేశస్తులు వెంటనే అక్కడి నుంచి తిరిగి రావాలని సూచించాయి అమెరికా,యూకే.  మరోవైపు  ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో హై అలెర్ట్‌ ప్రకటించింది భారత్‌. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించింది. యుద్ధ ఉద్రిక్తతల క్రమంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు రద్దయ్యాయి. గురువారం ధర్మశాలలో ఐపీఎల్‌ మ్యాచ్‌ను  ఆపరేశారు. లేటెస్ట్‌ పరిణామాల క్రమంలో బీసీసీఐ.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఐపీఎల్‌ ఇంకా 16 మ్యాచ్‌లు జరగాల్సి వుంది. వాటన్నంటిని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో   ఆసీస్‌ క్రికెటర్లు తమ స్వదేశానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు.

ఐపీఎల్‌ పోస్టపోనైంది. మరి మిస్‌ వరల్డ్‌  పోటీల సంగతేంటి? హైదరాబాద్‌ వేదికగా  మిస్‌ వరల్డ్‌ పోటీలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 31 వరకు  28 రకాల ఈవెంట్స్‌ కోసం అన్ని రకాలు ఏర్పాట్లు చేశారు. దాదాపు 110 దేశాల నుంచి  కంటెస్టెంట్స్‌  హైదరాబాద్‌కు చేరుకున్నారు. శనివారం  గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో మిస్‌ వరల్డ్‌ పోటీల ప్రారంభోత్సవానికి అంత సిద్దమైంది.  31న  హైటెక్స్‌లో  గ్రాండ్‌ ఫినాలె వుంటుంది.  ఆపరేషన్‌ సింధూర్‌  నేపథ్యంలో   మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుక  ద్వారా  ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి,పర్యాటక రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని  ప్రభుత్వం  భారీగా ఏర్పాట్లు చేసింది. విస్తృతంగా ప్రచారం నిర్వహించింది.

ఆపరేషన్‌ సింధూర్‌ నేపథ్యంలో  జంటనగరాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. మిస్‌ వరల్డ్‌, ఐపీఎల్‌ దృష్ట్యా    సెక్యూరిటీ పరంగా మరిన్ని చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ..మూడు పోలీస్‌ కమిషనరేట్లు ఇప్పుడు సీసీ కెమెరాల నిఘాలో వున్నాయి. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్‌  చేస్తున్నారు పోలీసులు. తాజా పరిణామాల నేపథ్యంలో  అతిథులు బస చోటే ప్రదేశాల్లో సెక్యూరిటీని పెంచారు. యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. మరి మిస్‌ వరల్డ్‌  పోటీలు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయా? ఇప్పటికైతే  షెడ్యూల్‌లో మార్పు మార్క్‌ లేదు.