Telangana: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు..టాపాసును అక్కడ పెట్టి కాల్చుతారా..?

దీపావళి పండుగ సందర్భంగా ఎంతో సంతోషంగా కొందరు యువకులు టపాసులు కాల్చారు. కానీ తమ వెక్కిలి చేష్టలను ప్రదర్శించారు.  జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ నోట్లో టపాసులు పెట్టి కాల్చారు. అంతేకాకుండా ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అవ్వడంతో బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు.

Telangana: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు..టాపాసును అక్కడ పెట్టి కాల్చుతారా..?
Miscreants Firing Cracker In Mahatama Gandhi

Edited By:

Updated on: Nov 04, 2024 | 11:50 AM

దీపావళి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అందరూ సరదాగా టపాసులు కాల్చితే కొందరు ఆకతాయిలు మాత్రం వెక్కిలి చేష్టలు చేశారు.  జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి కాల్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ ఘటన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో జరిగింది. ఈ ఘటన సీరియస్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసు ఇచ్చి పంపించారు. నలుగురిలో ఇద్దరు మైనర్లు కాగా మరో ఇద్దరు 10 రోజుల క్రితమే 18 సంవత్సరాలు దాటిన యువకులుగా గుర్తించారు.

వీడియో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us