AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫ్రెండ్‌ పార్టీకి పిలిచాడని వెళ్లాడు.. కట్‌చేస్తే.. ఫుల్‌గా తాగాకా..

డబ్బుల విషంలో ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన వివాదం చివరకు ఒకరి ప్రాణాలే తీసింది. ప్లాన్ ప్రకారం మద్యం సవిద్దాం అని పిలిపించి ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని అతి దారుణంగా రాళ్లతో కొట్టి హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: ఫ్రెండ్‌ పార్టీకి పిలిచాడని వెళ్లాడు.. కట్‌చేస్తే.. ఫుల్‌గా తాగాకా..
Hyderabad Murder
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 12, 2026 | 10:41 AM

Share

డబ్బు విషయంలో ఇద్దరి మద్య మనస్పర్దాలు రావడంతో ఒకరి హత్యకు ధారి తీసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్ నగర్‌లో వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కుర్మల్ గుడా రాజివ్ గృహకల్ప ప్రాంతంలో నివాసం ఉండే భజరంగ్ అనే వ్యక్తి స్థానికంగా సయ్యద్ ఇఫ్తాకర్ వద్ద ఫైనాన్స్ వాహనాలను సీజ్ చేసే ఉద్యోగం చేసే వాడు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు జరిగాయి. దీంతో ఒకరికంటే ఒకరికి పడనంతగా ఇద్దరి మధ్య మనస్పర్దాలు వచ్చాయి.

ఈ క్రమంలో భజ్‌రంగ్‌ తీవ్ర పగ పెంచుకున్న సయ్యద్ అతన్ని ఎలాగైనా దిబ్బతీయాలి అనుకున్నాడు. ప్లాన్ వేసి బార్కస్ ప్రాంతానికి మహమ్మద్ సహెల్, అబ్దుల్లా బిన్ అమేర్ అనే ఇద్దరు స్నేహితులను మద్యం తాగేందుకు రావాలని పిలిచాడు. అయితే వాళ్ల వెంట భజరంగ్‌ను కూడా తీసుకురావాలని తెలిపారు. దీంతో నలుగురు కలిసి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ఉస్మాన్ నగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు వెళ్ళి మద్యం సేవించారు. భజరంగ్‌ మత్తులోకి జారుకున్నాక ముగ్గురు కలిసి అతనిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన భజరంగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఇక ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాల ప్రకారం నిందితులను 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఫ్రెండ్‌ పార్టీకి పిలిచాడని వెళ్లాడు..కట్‌చేస్తే.. ఫుల్‌గా తాగాకా
ఫ్రెండ్‌ పార్టీకి పిలిచాడని వెళ్లాడు..కట్‌చేస్తే.. ఫుల్‌గా తాగాకా
చెత్తలో పడేయాలనుకున్న కారు..చివరికి రూ.47 లక్షల అదృష్టం తెచ్చింది
చెత్తలో పడేయాలనుకున్న కారు..చివరికి రూ.47 లక్షల అదృష్టం తెచ్చింది
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్..ఇంట్లో రాగితో చేసుకునేహెల్దీ టిఫిన్స్ఇవే
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్..ఇంట్లో రాగితో చేసుకునేహెల్దీ టిఫిన్స్ఇవే
సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరం.. మరి రాజస్థాన్ రాయల్స్‌ పరిస్థితి ?
సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరం.. మరి రాజస్థాన్ రాయల్స్‌ పరిస్థితి ?
ఫీల్ యువర్ లవ్..మీరు ఎంచుకునే హార్ట్ సింబలే మీ ప్రేమను తెలుపుతది
ఫీల్ యువర్ లవ్..మీరు ఎంచుకునే హార్ట్ సింబలే మీ ప్రేమను తెలుపుతది
సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే?
సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే?
ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని
ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని
అది ఫ్లైట్‌ కాదు భయ్యా ఆటో.. ట్రెండింగ్‌లోకి యువతి వీడియో
అది ఫ్లైట్‌ కాదు భయ్యా ఆటో.. ట్రెండింగ్‌లోకి యువతి వీడియో
టెంపుల్ సిటీలో కలర్ ఫుల్ ఈవెంట్..జాతరలో జంబలకడిపంబ!
టెంపుల్ సిటీలో కలర్ ఫుల్ ఈవెంట్..జాతరలో జంబలకడిపంబ!
డైరెక్టర్ వారించినా అభిమానుల కోసం ఎందాకైనా అంటూ..
డైరెక్టర్ వారించినా అభిమానుల కోసం ఎందాకైనా అంటూ..