సద్గురు చిట్కాలు : మీ సంబంధంలో ప్రేమ తగ్గిపోతోందా.. ఇలా చేయండి!

samatha

12 may 2026

సద్గురు అనేక విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. ఆయన బోధనలు మనసుకు ఎంతగానో హాయిని ఇస్తాయి.

సద్గురు

అందుకే చాలా మంది తన బోధనలు వినడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈయన బంధాల గురించి చాలా విషయాలు తెలియజేయడం జరిగింది.

బంధాలు

సంబంధంలో ప్రేమ తగ్గిపోతే కూడా ఏం జరుగుతుంది? అసలు బంధాలలో ప్రేమ ఎందుకు తగ్గిపోతుందో వివరించడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం.

సంబంధంలో ప్రేమ తగ్గితే

ఆయన మాట్లాడుతూ.. ఆనందకరమైన జీవితంలో ప్రేమ , నమ్మకం, నిజాయితీ అనేది చాలా ముఖ్యమైనది, నమ్మకం ఉన్నదగ్గరే ప్రేమ ఉంటుందంట.

ప్రేమ, నిజాయితీ

సద్గురు ప్రకారం ప్రేమకు నిజమైన పునాది నమ్మకం, నమ్మకం ఉన్నంత వరకే ఆ బంధం, బలంగా ఉంటుంది, నమ్మకం పోతే ఆ బంధం దెబ్బతింటుంది.

నమ్మకం

అలాగే బంధం బలంగా ఉండాలి అంటే తప్పకుండా గౌరవం ఇవ్వాలి. గౌరవం లేని బంధం ఎప్పుడూ ఎక్కువ కాలం నిలవదంట.

గౌరవం

అంతే కాకుండా అబద్ధాలు చెప్పడం చేయకూడదు. నిజం మాత్రమే మీ బంధాలను కాపాడుతుంది. అబద్ధాలు చెబితే అది ఎప్పటికైనా బలహీనపడుతుంది.

అబద్ధాలు చెప్పడం

సమయం ఇవ్వడం, మీరు మీ భాగస్వామికి సమయం ఇవ్వడం, తనకు దూరం ఉన్నా, దగ్గరగా ఉన్నా రోజులో కాసేపు తనతో మాట్లాడటం చేయడం వలన బంధం బలంగా ఉంటుందంట.

భాగస్వామికి సమయం ఇవ్వడం